Chandrabose: ‘నాటు నాటు’ ఆస్కార్ పాటకు 19 నెలలు కష్టపడ్డా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా పాట రాయడమంటే కేవలం పదాలను పేర్చడం కాదు, ఆ కథలోని ఆత్మను పట్టుకోవడం. ఆస్కార్ విజేత, గీత రచయిత చంద్రబోస్ తాజాగా ‘భోగి’ సినిమా పాటల విశేషాలతో పాటు, తన సుదీర్ఘ సినీ ప్రయాణంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇప్పటివరకు కొన్ని సినిమాల్లో తెలంగాణ మాండలికంలో పాటలు రాసినప్పటికీ, ‘భోగి’ సినిమాలో 1960ల నాటి స్వచ్ఛమైన, సహజమైన తెలంగాణ పల్లెటూరి బతుకు చిత్రాన్ని పూర్తిస్థాయిలో ఆవిష్కరించే అవకాశం దక్కిందని చంద్రబోస్ సంతోషం వ్యక్తం చేశారు. 13 ఏళ్ల వయసు వరకు తాను పల్లెటూరిలో పెరిగిన జ్ఞాపకాలు, చిన్నప్పుడు విన్న మాటలు కళ్ళు మూసుకోగానే ఒక వెల్లువలా బయటకు వచ్చాయని, అందుకే ఈ సినిమా పాటలు ఇంత సహజంగా వచ్చాయని ఆయన తెలిపారు.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ‘నాటు నాటు’ పాట వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని చంద్రబోస్ వెల్లడించారు. తాను అత్యంత వేగంగా రాసిన పాట ‘రంగస్థలం’లోని ‘ఎంత సక్కగున్నావే’ (కేవలం 40 నిమిషాల్లో) అయితే, అత్యధిక సమయం పట్టిన పాట మాత్రం ‘నాటు నాటు’ అని చెప్పారు. ఈ పాట కోసం ఏకంగా 19 నెలల పాటు (సంవత్సరం ఏడు నెలలు) కసరత్తు చేయాల్సి వచ్చిందన్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో రాజమౌళి ఫోన్ చేసి, చివరలో ఉన్న రాప్ (Rap) భాగం ఎదుటివారిని అవహేళన చేసినట్లుగా కాకుండా, పాటలోని ఉత్సాహాన్ని తెలిపేలా ఉండాలని సూచించడంతో, 15 నిమిషాల్లో కొత్తగా రాసి ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. ప్రేమ, విరహ గీతాలకు భిన్నంగా కేవలం ఆడిపాడే పాట ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలూగించడం వల్లే దీనికి ఆస్కార్ దక్కిందని ఆయన విశ్లేషించారు.
Also Read
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Chandrabose: ‘నాటు నాటు’ ఆస్కార్ పాటకు 19 నెలలు కష్టపడ్డా!
-
Hanuman 2 : వివాదానికి తెరలేపనున్న హనుమాన్ 2 ప్రకటన?
-
Human Skull Found : మొన్న మహిళ కాలు.. నేడు మనిషి పుర్రె.. ఇబ్రహీంపట్నంలో మిస్టరీ
-
Anchor Suma: మాట్లాడాలంటే వణికిపోతున్నారా? ఆ భయాన్ని పోగొట్టడానికి సుమ కొత్త అవతారం
-
Akhilesh Yadav: కాంగ్రెస్తో పొత్తుపై అఖిలేష్ కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!