Site icon NTV Telugu

Bheemla Nayak : జగన్ కక్ష సాధింపు చర్య… మూర్ఖత్వం వీడాలంటున్న చంద్రబాబు

Pawan

ఏపీ టికెట్ రేట్లు, థియేటర్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న మొండి వైఖరిపై అన్ని వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ విషయంపై పెదవి విరుస్తుండగా, తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. “భీమ్లా నాయక్” సినిమా విషయంలో జగన్ తీరు ఉగ్రవాదాన్ని తలపిస్తోందని మండిపడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి వరుస ట్వీట్లు చేశారు.

Read Also : Bheemla Nayak : ఏపీ మంత్రులకు షాకిచ్చిన పవన్ ఫ్యాన్స్

“రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సీఎం జగన్ వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది. వ్యక్తులను టార్గెట్టుగా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీ సిమెంట్ రేటుపై లేని నియంత్రణ భీమ్లా నాయక్ సినిమాపై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్ తన మూర్ఖపు వైఖరి వీడాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలన్నీ పక్కన పెట్టి, థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం. ఉక్రెయిన్లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ సిఎం మాత్రం ‘భీమ్లా నాయక్’పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. ‘భీమ్లా నాయక్’ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలి” అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

Exit mobile version