Unstoppable With NBK : ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన బాలయ్య.. అయినా తగ్గని బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆహా అన్ స్టాపబుల్ నాలుగో సీజన్‌లో మొదటి ఎపిసోడ్ గెస్టుగా వచ్చారు. ఈ షోలో తన బావమరిది నందమూరి బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ఇప్పటికే వదిలిన గ్లింప్స్, ప్రోమో అదిరిపోయాయి. ఇక ఈ సుదీర్ఘంగా జరిగిన ఈ ఎపిసోడ్‌లో అనేక ప్రశ్నలు బాలయ్య సందించారని తెలుస్తోంది. అయితే వాటికి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చారట. ఆ ప్రశ్నలు ఎంత కాంట్రవర్సీగా ఉన్నా కూడా సమయస్పూర్తితో సమాధానాలు ఇచ్చారని అంటున్నారు.
Boyapati : బోయపాటి భయపడుతున్నాడా..?
Also Read
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
జైలు జీవితం చంద్రబాబునాయుడిలో సీమపౌరుషాన్ని నిద్రలేపిందా? వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కూడా కటకటాలపాలు చేసి కక్ష తీర్చుకోవాలన్న కసి వచ్చిందా? మాజీ సీఎంకు వ్యతిరేకంగా చంద్రబాబు సిద్ధం చేసిన ఫైల్స్ ఏంటి? అని బాలయ్య అడిగినట్టు తెలుస్తోంది. అయితే ఏ నిర్ణయం తీసుకోవడంలో నైనా అచితూచి వ్యవహరించే చంద్రబాబు, గత అయిదేళ్ల పరిణామాలు చూసిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులకు దూకుడుగా సమాధానమిస్తారా లేదా ఎప్పటిలాగే వ్యవహరిస్తారా? అని ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. 53 రోజులు చంద్రబాబునాయుడు జైల్లో ఎలా గడిపారు ? సీఎంగా జైళ్లను ఆధునీకరించిన చంద్రబాబు.. ఓ నిందితుడిగా ఆ గదుల్లోనే గడపాల్సి రావడంతో ఎలా ఫిలయ్యారు? రాజమండ్రి జైల్లో VIPగా గడిపారా? భయంతో ఉక్కిరిబిక్కిరిఅయ్యారా? అనే ప్రశ్నలకు కూడా చాలా సమస్ఫూర్తితో ఆయన సమాధానాలు ఇచ్చారని అంటున్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు గోడల మధ్య నుంచి చంద్రబాబునాయుడు చూసిన ప్రపంచం ఎలా ఉంది? చదివిన పత్రికలేంటి? చూసిన టీవీలేంటి? కొత్తగా అలవర్చుకున్న అలవాట్లేంటి? అని బాలయ్య తన బావ చంద్రబాబుని అడగగా ఆయన కూడా తడుముకోకుండా సమాధానం ఇచ్చినట్టు చెబుతున్నారు. టీడీపీ-జనసేన మధ్య పొత్తును పవన్‌కల్యాణ్ ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందు రాజమండ్రిలోని సెంట్రల్ జైలు నాలుగుగోడల మధ్య జరిగిన మంత్రాంగమేంటి? ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ తర్వాత వచ్చిన ప్రకటనా? పవన్ ఎమోషన్‌లో తీసుకున్న నిర్ణయమా? అని ప్రశ్నలు సంధించారని అంటున్నారు.
లోకేష్, పవన్‌కల్యాణ్, బాలయ్య ముగ్గురిలో చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరు? అని కూడా అడిగారని దానికి తోడు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణిలలో చంద్రబాబు సపోర్ట్ ఎవరికీ అంటూ చంద్రబాబుని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారట. జూనియర్ ఎన్టీఆర్, అమరావతి ప్రస్తావన సహా అనేక విషయాల గురించి సంధించిన ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు ఎలాంటి సమాధానాలు చెప్పారో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.
Two unstoppable forces, one epic show! 💥🔥
విజయసాధనలో పడ్డ ఇబ్బందులు,
జనసేనానితో తనకున్న అప్యాయతలు,
ఇలా ఎన్నో అంశాలు, అనుభూతులు,
బాలచంద్రుల ముచ్చట్లలో మీ ముందుకు!#UnstoppableS4 premieres on Oct 25, 8:30 PM.#Chandrababunaidu #UnstoppableWithNBK #NandamuriBalakrishna pic.twitter.com/V3UkpxyxoI— ahavideoin (@ahavideoIN) October 22, 2024
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!