Site icon NTV Telugu

Chandoo Mondeti: రానా, అక్షయ్ కుమార్ హీరోలుగా హిస్టారికల్ థ్రిల్లర్?

Akshay Kumar Rana Daggubati

Akshay Kumar Rana Daggubati

Chandoo Mondeti Rana Daggubati Movie: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ చందు మొండేటి మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ‘కార్తికేయ 2’, ‘తండేల్’ వంటి విజయాల తర్వాత, ఆయన ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌తో జతకట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ‘బేబీ’ సినిమాలో కలిసి నటించిన రానా దగ్గుబాటి, అక్షయ్ కుమార్ ఇప్పుడు ఈ సినిమాలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. చందు మొండేటి రూపొందించబోయే ఈ చిత్రంలో వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా అక్షయ్ కుమార్ ఇందులో ఒక పవర్ ఫుల్ రోల్ ప్లే చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాదు, మరో టాప్ హీరో కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది.

Also Read:Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాకి హీరోయిన్లు ఫిక్స్.. ఎవరంటే?

ఈ సినిమా కథాంశం పురాతన నగరం ఉజ్జయిని నేపథ్యంలో సాగనుంది. చరిత్ర, పురాణాలు మరియు మిస్టరీ మేళవింపుతో ఈ హిస్టారికల్ థ్రిల్లర్‌ను చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. ‘కార్తికేయ 2’తో పురాణాలను ఆసక్తికరంగా చూపించిన ఆయన, ఈసారి అంతకంటే పెద్ద స్థాయిలో మ్యాజిక్ చేయబోతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ (ధర్మ ప్రొడక్షన్స్) ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఉత్తరాది, దక్షిణాది ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version