Chandoo Mondeti: రానా, అక్షయ్ కుమార్ హీరోలుగా హిస్టారికల్ థ్రిల్లర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandoo Mondeti Rana Daggubati Movie: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ చందు మొండేటి మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ‘కార్తికేయ 2’, ‘తండేల్’ వంటి విజయాల తర్వాత, ఆయన ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌తో జతకట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ‘బేబీ’ సినిమాలో కలిసి నటించిన రానా దగ్గుబాటి, అక్షయ్ కుమార్ ఇప్పుడు ఈ సినిమాలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. చందు మొండేటి రూపొందించబోయే ఈ చిత్రంలో వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా అక్షయ్ కుమార్ ఇందులో ఒక పవర్ ఫుల్ రోల్ ప్లే చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాదు, మరో టాప్ హీరో కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది.
Also Read:Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాకి హీరోయిన్లు ఫిక్స్.. ఎవరంటే?
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఈ సినిమా కథాంశం పురాతన నగరం ఉజ్జయిని నేపథ్యంలో సాగనుంది. చరిత్ర, పురాణాలు మరియు మిస్టరీ మేళవింపుతో ఈ హిస్టారికల్ థ్రిల్లర్‌ను చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. ‘కార్తికేయ 2’తో పురాణాలను ఆసక్తికరంగా చూపించిన ఆయన, ఈసారి అంతకంటే పెద్ద స్థాయిలో మ్యాజిక్ చేయబోతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ (ధర్మ ప్రొడక్షన్స్) ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఉత్తరాది, దక్షిణాది ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?