Site icon NTV Telugu

విడుదలైన ‘ఛ‌లో ప్రేమిద్దాం’ ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్టర్

Chalo-Premiddam

Chalo-Premiddam

హిమాల‌య స్టూడియో మేన్సన్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి జంటగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శక‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఛ‌లో ప్రేమిద్దాం’. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ తో పాటు మోష‌న్ పోస్టర్ ఆవిష్కర‌ణ జరిగింది. డైర‌క్టర్ గోపిచంద్ మ‌లినేని వీటిని విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా గోపిచంద్ మ‌లినేని ‘మోష‌న్ పోస్టర్ న‌చ్చడంతో లాంచింగ్ కి వ‌చ్చాను. అంద‌రూ నిర్మాత గురించి గొప్పగా చెబుతుంటే నాకు, నా తొలి సినిమా నిర్మాత వెంక‌ట్ గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయ‌న కూడా ఒక కొత్త డైర‌క్టర్ కి ఎంత స‌పోర్ట్ చేయాలో అంత స‌పోర్ట్ చేశారు. అలా ‘ఛ‌లో ప్రేమిద్దాం’ నిర్మాత ఉద‌య్ కిర‌ణ్ ఇచ్చిన మాట కోసం సురేష్‌కి సినిమా ఇచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఉద‌య్ కిర‌ణ్ ఖచ్చితంగా గొప్ప నిర్మాత‌గా ఎదుగుతారు. ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్టర్ చూశాక విజువ‌ల్ ట్రీట్ లా సినిమా ఉండ‌బోతుంద‌ని అర్థమ‌వుతోంది. భీమ్స్ ఎప్పటిలాగే ఈ సినిమాకు కూడా మంచి పాట‌లు ఇచ్చి ఉంటారు’ అన్నారు.

Read Also : తగ్గేదే లే… రికార్డ్స్ బద్దలు కొడుతున్న “రాధేశ్యామ్”

నిర్మాత ఉద‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ ‘బిజీ షెడ్యూల్ లో మోష‌న్ పోస్టర్ విడుదల చేయటానికి వచ్చిన గోపిచంద్ మలినేనికి, బెక్కం వేణుగోపాల్ కి థ్యాంక్స్. నవంబ‌ర్ నెలాఖ‌రులో సినిమాను రిలీజ్ చేస్తున్నాం’ అన్నారు. సంగీత ద‌ర్శకుడు భీమ్స్ మాట్లాడుతూ ‘డైర‌క్టర్ సురేష్ నా నుంచి మంచి మెలోడీస్ తీసుకున్నారు. ఈ సినిమాతో మాస్ పాట‌లే కాదు మంచి మెలోడీస్ కూడా చేయ‌గ‌ల‌నని ప్రూవ్ చేసుకునేలా ఉంటుంది. నేప‌థ్య సంగీతం భీమ్స్ చేయ‌గ‌ల‌డా అనే అపోహ కూడా ఈ సినిమాతో పోతుంది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మా నిర్మాత రాజీ ప‌డ‌కుండా చాలా రిచ్ గా తీసారు’ అన్నారు.

Exit mobile version