Chadalavada Srinivasa Rao Interview for Record Break Movie: పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.
ఇంత ఖర్చు పెట్టడానికి కారణం
గతంలో హీరోలు హీరోయిన్లు రెమ్యూనరేషన్ తక్కువ ఉండేవి, డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇంత మంది లేరు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి, బిచ్చగాడు వంటి సినిమా నిర్మించిన తర్వాత కంటెంట్ ఉంటే ప్రజలు ఏ సినిమా అయినా సక్సెస్ చేస్తారనిపించింది. అందుకే ప్రజలు మనసుకి హత్తుకునే విధంగా నిజానికి దగ్గరగా నమ్మకంతో చాలా ఖర్చు పెట్టి ఈ సినిమాను నిర్మించా.
రికార్డ్ బ్రేక్ టైటిల్ జస్టిఫికేషన్
ట్రైలర్ రిలీజయినప్పుడు వచ్చిన రెస్పాన్స్ , స్పెషల్ షోస్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి అందరూ ఈ సినిమాకి ఇది కరెక్ట్ టైటిల్ అని చెప్పడం మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఈ సినిమాకి ఇదే యాప్ట్ టైటిల్ అని అందరూ అన్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు కూడా అదే ఫీలవుతారు.
క్లైమాక్స్ గ్రాఫిక్స్- హీరోలు వీళ్లే
సినిమాకి అది అవసరం ముందే అనుకునే అంత ఖర్చు పెట్టి ఆ గ్రాఫిక్స్ ని చేయించాం. ప్రజెంట్ ఉన్న హీరోల్లో అంత బాడీ ఉన్నవాళ్లు వెయిట్ పుటప్ చేయగలిగిన వాళ్లు ఎవరూ లేరు. అప్పటి కాలానికి ఒక రామారావు, కృష్ణంరాజు ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ గా సెట్ అయ్యారు.
ఎనిమిది భాషల్లో రిలీజ్
ఎక్కడో తెనాలిలో చిన్న కర్రలు వ్యాపారం చేసే వాడిని, అలాంటిది సినీ కళామతల్లి వల్ల ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను. నా మంచి మిత్రులు సపోర్ట్ చేయడం,నేను వాళ్లకు సపోర్ట్ చేయడం ఇలా ఇండస్ట్రీలో ఎదిగి ఈ పొజిషన్ లో ఉన్నాను.
బిచ్చగాడు లాగా
థియేటర్లు ఎక్కువ దొరికినా, నేనే బిచ్చగాడు లాగా కొన్ని థియేటర్లు రిలీజ్ చేసి సినిమా సక్సెస్ తర్వాత పెంచుకుందామనుకున్నా. నాకు ఎన్ని థియేటర్లు అయినా ఇస్తారు కానీ నేను ఒత్తిడి తీసుకు రాకుండా మంచి సినిమాని తక్కువ థియేటర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకు వద్దాం అనుకుంటున్నా.
ఈ సినిమాతో డైరెక్షన్ కంటిన్యూ చేస్తారా?
ఈ సినిమా ద్వారా నేను డైరెక్షన్ నేర్చుకున్నా,. ఈ సినిమా సక్సెస్ తరువాత మంచి టెక్నికల్ వాల్యూస్ తో వార్నర్ బ్రదర్స్ తీసే సినిమా కంటే గొప్ప సినిమా తీసి చూపిస్తా. ప్రేక్షకులందరికీ సినిమా చూసి పాస్ మార్కులు ఇస్తే డైరెక్షన్ లో ఇంకా మంచి సినిమాలు తీస్తా..