Arya: శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా తెలుగులో ‘కెప్టెన్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ ఆర్య కథానాయకుడిగా నటించిన సినిమా ‘కెప్టెన్’. ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి శక్తి సౌందర్ రాజన్ దర్శకుడు. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య దీనిని నిర్మించారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో ఈ సినిమాను ఇటీవల ‘విక్రమ్’ చిత్రాన్ని విడుదల చేసిన శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఆర్య, దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ కలయికలో రెండో చిత్రమిది. ఇంతకు ముందు వీళ్ళిద్దరూ ‘టెడ్డీ’ సినిమా చేశారు. ‘కెప్టెన్’ విషయానికి వస్తే… వినూత్న కథాంశంతో సినిమా రూపొందింది. సోమవారం యూత్ స్టార్ నితిన్ తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు.

Also Read
- Anand Deverakonda: ఆ స్టార్ హీరోయిన్‌పై క్రష్.. ఆనంద్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
- National Film Awards: చివరి నిమిషంలో షాక్.. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వాయిదా
- July Releases : జూలై బాక్స్ ఆఫీస్ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆరుగురు హీరోలు
- Tollywood : అక్టోబర్‌లో రజనీ vs చిరు vs వెంకీ.. గెలుపెవరిది
‘కెప్టెన్’లో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేశారు ఆర్య. కెప్టెన్ విజయ్ కుమార్ పాత్రలో నటించారు. ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఉంది. రెగ్యులర్ ఆర్మీ బేస్డ్ సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ స్టోరీతో హాలీవుడ్ స్థాయిలో సినిమా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఒక అడవిలో వింత జీవులను ఎదుర్కోవడానికి హీరో అండ్ టీమ్ వెళ్ళినప్పుడు ఏమైందనేది కథగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఆర్య జోడీగా ఐశ్వర్య లక్ష్మి కనిపించారు.
తాజావార్తలు
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ “New Chapter” పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
-
TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!
-
BLA: గ్వాదర్ కోస్ట్ గార్డ్ క్యాంప్‌పై దాడి.. 30 మంది పాకిస్తానీ భద్రతా సిబ్బందిని హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటన
-
Keeway Hypvolt-R: భారత్‌లోకి కీవే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రీమియం ఫీచర్లు, 180KM రేంజ్
ట్రెండింగ్
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!