Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Can These Directors Save Bollywood

Bollywood: బాలీవుడ్‌ను కాపాడేది వాళ్ళేనా!?

Published Date :August 15, 2022 , 5:54 pm
By Subbarao N
Bollywood: బాలీవుడ్‌ను కాపాడేది వాళ్ళేనా!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Can These Directors Save Bollywood: బాలీవుడ్‌లో పేరున్న స్టార్ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోతున్నాయి. ఇక దక్షిణాది డబ్బింగ్ సినిమాల వేవ్‌లో హిందీ చిత్రాలు చతికిల పడిపోవడం బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తోంది. దీనికి తోడు మీడియా కూడా సౌత్ సినిమా ముందు వెలవెల బోతున్న బాలీవుడ్ అంటూ ప్రతీవారం ఏదో ఒక కోణంలో కథలు ప్రచురిస్తూనే ఉన్నాయి. అయితే అసలైన దర్శకుల చిత్రాలు ఇంకా జనం ముందుకు రాలేదని, వస్తే మళ్ళీ బాలీవుడ్ వెలిగిపోతుందని అక్కడి విశ్లేషకులు అంటున్నారు. మరి వారిలో అంతగా ఆశలు రేపుతున్న వారెవరో ఓ సారి చూద్దాం.

ఆల్ ఇండియా టాప్ టెన్‌లో నాలుగు సినిమాలు దక్షిణాదివారివే ఉన్నాయి. ఆ నాలుగు కూడా డబ్బింగ్ మూవీస్ కావడం విశేషం. వాటిలో 2వ స్థానంలోని ‘బాహుబలి-2’, 4వ స్థానం ఆక్రమించిన ‘ట్రిపుల్ ఆర్’, 9వ స్థానంలో ఉన్న ‘బాహుబలి-1’ చిత్రాలు తెలుగు దర్శకుడు రాజమౌళి రూపొందించినవి. ఇక మూడో స్థానంలో వెలుగుతున్న ‘కేజీఎఫ్-2’ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కింది. అందువల్ల మిగిలిన స్థానాల్లోని దర్శకులు తప్పకుండా బాలీవుడ్‌ను కాపాడుతారని విశ్లేషకులు ఆశిస్తున్నారు.

బాలీవుడ్ బాబుల లెక్కల ప్రకారం టాప్ టెన్‌లో నంబర్ వన్ స్థానంలో నిలచిన ‘దంగల్’ దర్శకుడు నితీశ్ తివారీ తాజా చిత్రం కోసం వేచి ఉన్నారు. నితీశ్ తివారీ తరువాత ‘బ్రేక్ పాయింట్’ అనే డాక్యుమెంటరీని జీ5 ఓటీటీ కోసం రూపొందించారు. ఆయన దర్శకత్వంలో ఆపై ఏ సినిమా రూపొందలేదు. ప్రస్తుతం ‘బవాల్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు నితీశ్ తివారీ. ఇందులో వరుణ్ ధవన్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది వెలుగు చూడనుంది.

టాప్ టెన్‌లో ఐదో స్థానంలో నిలచిన ‘బజరంగీ భాయిజాన్’ దర్శకుడు కబీర్ ఖాన్ మాత్రం జనాన్ని నిరాశ పరిచారనే చెప్పాలి. ఆ తరువాత ఆయన తెరకెక్కించిన “ఫాంటమ్, ట్యూబ్ లైట్, 83” చిత్రాలేవీ టాప్ టెన్‌లో చోటు సంపాదించలేకపోయాయి. అయినా కబీర్ ఖాన్ ఏదో ఒకరోజున బంపర్ హిట్ కొడతాడని హిందీ జనం ఆశిస్తున్నారు. ఆరో స్థానంలో నిలచిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ చిత్ర దర్శకుడు అద్వైత్ చందన్ రూపొందించిన ‘లాల్ సింగ్ చడ్డా’ ఇటీవలే జనం ముందు నిలచి పరాజయాన్ని చవిచూసింది.

టాప్ టెన్ లో ఏడో స్థానం ఆక్రమించిన ‘పీకే’ చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తరువాత తెరకెక్కించిన ‘సంజు’ కూడా వసూళ్ళ వర్షం కురిపించింది. అయితే ‘పీకే’ స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన షారుఖ్ ఖాన్ హీరోగా ‘డన్కీ’ అనే చిత్రం తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. పదో స్థానంలో నిలచిన ‘సుల్తాన్’ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తరువాత తెరకెక్కించిన చిత్రాలలో ‘టైగర్ జిందా హై’ పరవాలేదనిపించింది. అయితే ఆయన రూపొందించిన ‘భారత్, తాండవ్’ అంతగా ఆకట్టుకోలేక పోయాయి. షాహిద్ కపూర్ తో తెరకెక్కిస్తోన్న ‘బ్లడీ డాడీ’ డిసెంబర్ లో విడుదల కానుంది. ఆ సినిమాపై కూడా బాలీవుడ్ జనం ఆశలు పెట్టుకున్నారు.

సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన కొన్ని చిత్రాలు ఒకప్పుడు టాప్ టెన్ లో చోటు సంపాదించినవే. ఆయన తెరకెక్కించిన ‘గంగుబాయ్ కతియవాడి’ పరవాలేదు అనిపించుకుంది. మళ్ళీ భన్సాలీ దర్శకత్వంలో ఏ చిత్రం రూపొందనుందో తెలియదు. కానీ, ఈ సారి సంజయ్ తన చిత్రంతో బాలీవుడ్ ను మరింతగా వెలిగిస్తాడని ఆశిస్తున్నారు అక్కడి జనం. రోహిత్ శెట్టికి ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ తరువాత ఆ స్థాయి సక్సెస్ రాలేదు. కానీ, ప్రస్తుతం రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డే జోడీగా ఆయన తెరకెక్కిస్తోన్న ‘సర్కస్’పై బాలీవుడ్ బాబులు బాగానే ఆశలు పెంచుకున్నారు.

ఒకప్పుడు తన “మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్” చిత్రాలతో ఆల్ ఇండియాను షేక్ చేసిన సూరజ్ బర్జాత్యాపైనా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రధారిగా, సూరజ్ తెరకెక్కిస్తోన్న ‘ఊంచాయ్’పై కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, అమితాబ్ బచ్చన్ వంటి మాజీ సూపర్ స్టార్ తో ఇప్పట్లో బంపర్ హిట్ కొట్టే అవకాశాలు తక్కువే అని సినీజనం అంటున్నారు. తక్కువ బడ్జెట్ తో మంచి విజయాలను చూపించిన శ్రీరామ్ రాఘవన్ ‘అంధాదున్’ తరువాత తెరకెక్కిస్తోన్న ‘మెర్రీ క్రిస్మస్’ ఈ యేడాదే వెలుగు చూడనుంది. దానిపైనా కొందరికి ఆశలు ఉన్నాయి. ఇందులో కత్రినా కైఫ్, సౌత్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నారు. మరి ఈ సినిమాల్లో ఏ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటి, పరువు నిలుపుతాయో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood
  • kabir khan
  • Nitesh Tiwari
  • Sanjay Leela Bhansali
  • Shahrukh Khan Dunki

తాజావార్తలు

  • Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

  • AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్‌ చేసిన నగల విడుదలకు బ్రేక్..

  • Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions