Garima: మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ‘సి.ఐ. భారతి’ షూటింగ్ ప్రారంభం
C.I. Bharathi: కింగ్ డమ్ మూవీస్ పతాకంపై ‘ఘర్షణ’ శ్రీనివాస్ సమర్పణలో రమణారెడ్డి గడ్డం దర్శకత్వంలో విశాల పసునూరి నిర్మిస్తున్న చిత్రం ‘సిఐ భారతి’. నరేంద్ర, గరిమా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. నటుడు అలీ తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు రమణారెడ్డి గడ్డం మాట్లాడుతూ, “రొటీన్ కి భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ‘సి.ఐ. భారతి’ ఒక పవర్ ఫుల్ స్టోరి. మంత్రి మల్లా రెడ్డి గారు, నటుడు అలీ మా చిత్ర ప్రారంభోత్సవానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఆవులు పశుగ్రాసం లేక చెత్త కుప్పల దగ్గర పేపర్లు తినే పరిస్థితి చూస్తున్నాం. దీని గురించి మా చిత్రంలో ఒక ట్రాక్ పెట్టడం జరిగింది. మా సినిమా ద్వారా వచ్చే రిటర్స్న్ లో కొంత భాగం పశుగ్రాసం కోసం కేటాయిస్తాం. గతంలో నేను రెండు సినిమాలు చేశాను. ఏప్రిల్ 10 నుంచి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేయనున్నాం” అని చెప్పారు. సమర్పకులు ‘ఘర్షణ’ శ్రీనివాస్ మాట్లాడుతూ… “దర్శకుడు రమణారెడ్డి బౌండెడ్ స్క్పిప్ట్ తో వచ్చారు. కథ నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకొచ్చాను. రమణా రెడ్డి గారు అన్నీ తానై సినిమా చేస్తున్నారు. ఇంత మంచి చిత్రాన్ని నేను ప్రొడ్యూస్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది” అని అన్నారు. ఒక మంచి స్క్రిప్ట్ లో హీరోగా నటించడం చాలా సంతోషంగా ఉందని, తన క్యారెక్టర్ ను దర్శకుడు రమణారెడ్డి చాలా బాగా డిజైన్ చేశారని హీరో నరేంద్ర చెప్పారు. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించే అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు హీరోయిన్ గరిమా కృతజ్ఞతలు తెలిపింది.
Also Read
- Varanasi: మహేష్ బాబు వారణాసికి నీటి కష్టాలు.. జక్కన్న రిక్వెస్ట్‌కు సింపుల్‌గా నో చెప్పిన జలమండలి!
- Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
- Dacoit OTT Release Date: అడివి శేష్ 'డెకాయిట్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
- Sundar C: రజనీ, కమల్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా.. డైరెక్టర్ సుందర్ సి సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!