RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా?

Ram 23 Eka

Ram 23 Eka

ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా దర్శకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘RAPO23’. నటుడిగానే కాకుండా మొదటిసారి మెగాఫోన్ పట్టి దశాబ్దాల కల నెరవేర్చుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పాండిచ్చేరి తీర ప్రాంతంలో శరవేగంగా జరుగుతోంది.తాజా షెడ్యూల్‌లో భాగంగా చిత్రబృందం పాండిచ్చేరిలోని సుందరమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలతో పాటు ఒక కలర్‌ఫుల్ పాటను కూడా చిత్రీకరిస్తోంది. అలాగే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కోసం కొన్ని పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్లను కూడా ఇక్కడే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక క్రేజీ ప్రచారం సాగుతోంది. ఈ చిత్రానికి ఏక – ద లోన్ వోల్ఫ్(EKA – The Lone Wolf) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు జోరుగా టాక్ నడుస్తోంది. కథకు తగ్గట్టు సినిమాలో రామ్ పోతినేని పోషిస్తున్న ‘వీర’ పాత్ర తీరుతెన్నులకు ఈ టైటిల్ అత్యంత సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారు. రామ్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టైటిల్ వార్తలపై మేకర్స్ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్న ఈ సినిమాకు సామ్ CS సంగీతం అందిస్తున్నారు. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న రామ్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.