సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో ఘట్టమనేని అభిమానులకి మాత్రమే కాకుండా మొత్తం సినీ అభిమానులందరికి నచ్చిన సినిమా ఏదైనా ఉందా అంటే యునానిమస్ గా వచ్చే ఆన్సర్ ‘బిజినెస్ మాన్’. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెన్ పవర్ ని చూపించిన ఈ మూవీలో మహేష్ బాబు ‘సూర్య భాయ్’ అనే కొత్త డ్రగ్ ని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చాడు. పదేళ్లు దాటినా ఆ డ్రగ్ మత్తు తెలుగు ప్రేక్షకులని వదలలేదు. హీరో క్యారెక్టరైజేషన్ పీక్ స్టేజ్ లో ఉంటే ఎలా ఉంటుందో బిజినెస్ మాన్ సినిమా నిరూపించింది. ఈ మూవీలోని ప్రతి డైలాగ్ కి ఫాన్స్ ఉన్నారు, హార్డ్ రియాలిటీని డైలాగ్స్ లో పూరి సూపర్బ్ గా చెప్పాడు. సూర్య భాయ్ అనే గ్యాంగ్ స్టర్ గా మహేష్ ఇచ్చిన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి బాక్సాఫీస్ షేక్ అయ్యింది. కాజల్ గ్లామర్ కి యూత్ ఫిదా అయ్యారు.
ఈరోజుకీ మహేష్-పూరి కాంబినేషన్ ని కోరుకునే ఫాన్స్ ఉన్నారు అంటే అది బిజినెస్ మాన్ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్. ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ ఫుల్ జోష్ లో సాగుతుంది కాబట్టి బిజినెస్ మన్ సినిమా రీరిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే కావడంతో ఆరోజు బిజినెస్ మాన్ సినిమా రీరిలీజ్ చెయ్యనున్నారు. సాధారణంగా రీరిలీజ్ అంటే ఆ హీరో ఫాన్స్ మాత్రమే వెళ్తారు కానీ బిజినెస్ మాన్ సినిమా చూడడానికి మాత్రం ప్రతి హీరో ఫాన్స్ వెళ్తారు. సో కచ్చితంగా బిజినెస్ మాన్ సినిమా రీరిలీజ్ ట్రెండ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చెయ్యడం గ్యారెంటీ. మరి ఈ సినిమాకి వచ్చే రీచ్ ని చూసైనా మహేష్ అండ్ పూరి మళ్లీ సినిమా చేస్తారేమో చూడాలి.
The countdown is on for the
‘𝗕𝗶𝗴𝗴𝗲𝘀𝘁 𝗕𝗶𝗿𝘁𝗵𝗱𝗮𝘆 𝗕𝗹𝗮𝘀𝘁 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗬𝗲𝗮𝗿’ ! 🔥🤩Superstar @UrstrulyMahesh's #BusinessMan is set to conquer the screens once again 🤙🏾🤙🏾🤙🏾
This August 💥💥💥#Businessman4K ⏳❤️🔥 pic.twitter.com/q6Cuw7ib2X
— Mahesh Babu Space (@SSMBSpace) July 1, 2023