సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాల్లో ‘సంక్రాంతి వస్తున్నాం’ ఒకటి. వెంకటేష్ హీరోగా , రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆకర్షించే ఎమోషనల్‌తో పాటు, పక్క కామెడీ ఎంటర్టైన్మెంట్ గా, ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. వెంకీ మామ, అనిల్ కాంబో ముందు నుండే హిట్ కాంబినేషన్. వీరిద్దరు కలిసి వస్తున్నారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ మిల్స్ అనట్లే. అలాగే ఈ సారి కూడా ‘సంక్రాంతి వస్తున్నాం’ తో ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయ్యారు.
ఈ మూవీలో అందరి కామెడీ ఒకెత్తు అయితే, బుల్లి రాజు కామెడీ ఒకెత్తు. వెంకటేష్ కొడుకు గా నటించిన రేవంత్ అనే ఈ అబ్బాయి సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక మొదటి చిత్రంతోనే పాపులర్ అయిపోయాడు బుల్లి రాజు. సినిమాలో అతను ఎంట్రీ ఇచ్చాడు అంటే చాలు ధియెటర్‌లో ఈలల్లు మోగిపోతున్నాయి. ఇంత మంచి సక్సెస్ అందుకున్న రేవంత్ ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారిపోయాడు. ఇతని నటనకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపొయింది.
అయితే మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో బుల్లి రాజుకు అవకాశం ఇవ్వాలని అనిల్ రావిపూడి అనుకుంటున్నాడట. దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటనప్పటి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం మహేష్ , దర్శకుడు రాజమౌళి తో మూవీ చేస్తున్నాడు.