Bro Teaser: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అని పాడుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్. మరి భీమ్లా నాయక్ తరువాత పవన్ ను వెండితెర మీద చూసే ఛాన్స్ వచ్చేసింది. ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా పవన్ మాత్రం సినిమాలను వదలడం లేదు. ప్రస్తుతం పవన్ నటించిన చిత్రం బ్రో. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. మొట్టమొదటి సారి మేనమామతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. తమిళ నటుడు, దర్శకుడు అయిన సముతిర ఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇక త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కొద్దిగా లేట్ అయినా .. టీజర్ ను మాత్రం ఆదరగొట్టేశారు. టీజర్ లో మామఅల్లుళ్ళు దుమ్ములేపేశారు. పవన్ దేవుడు టైమ్ గా కనిపిస్తుండగా.. తేజ్.. మార్క్ అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా కనిపించాడు.
” ఏంటి.. ఇంత చీకటిగా ఉంది.. ఎవరైనా ఉన్నారా.. హలో మాస్టరూ.. గురువు గారు.. తమ్ముడు.. బ్రో” అని తేజ్ కేకలు పెడుతున్న డైలాగు తో టీజర్ ప్రారంభమయ్యింది. ఇక పిలిచిన ప్రతి సారి పవన్ ఎలివేషన్ షాట్స్ అయితే అదిరిపోయాయి. టీజర్ మొత్తం ఫన్ రైడ్ గా సాగింది. కాలం.. మీ గడియారాన్ని అందని ఇంద్రజాలం.. అని పవన్ డైలాగ్ ఆకట్టుకొంటుంది. మామఅల్లుళ్ళు మాత్రం టీజర్ లో అదరగొట్టారు. కోపధారి మనిషిగా తేజ్ కనిపించగా.. ఇంకా అతనిని రెచ్చగొట్టే కాలం గా పవన్ కనిపించాడు. ప్రమాదంలో చనిపోయిన తేజ్ కు మరో ఛాన్స్ ఇవ్వడానికి భూమి మీదకు దిగివచ్చిన దేవుడుగా పవన్ కనిపించాడు. ఇక రెండో ఛాన్స్ వచ్చాకా తేజ్ .. తన జీవితంలో ఎలాంటి మార్పును తెచ్చుకున్నాడు..? అనేది వినోదాత్మకంగా చూపించారు. త్రివిక్రమ్ డైలాగ్స్ థియేటర్ లో మాములుగా ఉండవని తెలుస్తోంది. ఇక థమన్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. మొత్తానికి టీజర్ అద్భుతంగా ఉంది. మరి ఈ సినిమాతో మామఅల్లుళ్ళు హిట్ ను అందుకుంటారో లేదో చూడాలంటే జూలై 28 వరకు ఆగాల్సిందే.