Brad Pitt:”నీకూ నీ వారు లేరు… నాకూ నా వారు లేరు… చల్ మోహన రంగా…” అంటూ గర్ల్ ఫ్రెండ్ ఐన్స్ డీ రమోన్ తో జోడు కూడి గాల్లో తేలిపోవాలనుకున్నాడు బ్రాడ్ పిట్. నటి ఏంజెలినా జోలీతో విడాకులు తీసుకున్నప్పటి నుంచీ బ్రాడ్ పిట్ ఒంటరి జీవితం సాగిస్తున్నాడు. అప్పటి నుంచీ డీ రమోన్ తో ప్రేమాయణం నెరపుతున్నాడని తరచూ వినిపిస్తోంది. అయితే ఇప్పటి దాకా వారిద్దరూ కలసి ఉన్న ఫోటోలు అంతగా కనిపించలేదు. ఒకవేళ కనిపించినా, అదేదో ప్రొఫెషనల్ వర్క్ పై కలసినదే తప్ప ఏమీ లేదంటూ దాటవేస్తూ వచ్చాడు బ్రాడ్. కానీ, ఈ మధ్య డి రమోన్ తో కలసి బ్రాడ్ పిట్ డిన్నర్ చేస్తూ ప్యారిస్ లో దొరికిపోయాడు.
Dick Van Dyke: 97 ఏళ్ళ ముసలోడికి పండగ!
ప్యారిస్ లో ఈ జంట ఫోటోలకు చిక్కినా, అందులోనూ వారి చుట్టూ ఎంతోమంది జనం ఉన్నారు. వారందరూ బ్రాడ్ పిట్ కు అత్యంత సన్నిహితులు అని తెలుస్తోంది. ప్రస్తుతం బ్రాడ్ పిట్ వయసు 59 సంవత్సరాలు. ఈ యేడాది డిసెంబర్ 18తో అరవై ఏళ్ళు పూర్తి చేసుకోనున్నాడు. ఇక డి రమోన్ వయసు 30 సంవత్సరాలే. అంటే బ్రాడ్ వయసులో సగం! ఈ ఇద్దరికీ జోడీ కూడా భలేగా కుదిరింది. ఆమె ‘ద వ్యాంపైర్ డైరీస్’ స్టార్ పాల్ వెస్లీతో మూడేళ్ళు కాపురం చేసింది. పెళ్ళి పెటాకులు కాగానే, బ్రాడ్ బాట పట్టింది. 2019లో బ్రాడ్ కూడా ఏంజెలినాతో విడిపోయాడు. అలా ఆమె, అతను ఇద్దరూ విడాకులు తీసుకున్నవారే! కాబట్టి, ఏ లాంటి బాదరబందీ లేదు. ఎంచక్కా చెట్టాపట్టాలేసుకు తిరగవచ్చు. మరి ఏమిటి ఆలస్యం అంటారా? విడాకులయితే తీసుకున్నారు కానీ, బ్రాడ్, ఏంజెలినా మధ్య కొన్ని ఆస్తి తగాదాలు ఓ కొలిక్కి రాలేదు. కోర్టుల్లో నానుతున్నాయి. అవి క్లియర్ అయిన తరువాత బ్రాడ్, రమోన్ ఒక్కటయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది. అప్పటి దాకా ఇంతేనా!?