Dick Van Dyke: “వయసుతో పనియేముంది? మనసులోనే అంతా ఉంది” అంటూ పాట అందుకుంటున్నాడు 97 ఏళ్ళ డిక్ వేన్ డైక్. 1925 డిసెంబర్ 13న జన్మించిన డిక్ సెంచరీకి దగ్గరవుతున్నా, ఇంకా కుర్రాడిలాగే ఉరకలు వేస్తున్నారు. “బై బై బర్డీ (1963), మేరీ పాపిన్స్ (1964), చిట్టీ చిట్టీ బ్యాంగ్ బ్యాంగ్ (1968), ద కామిక్ (1969)” వంటి చిత్రాలతో అలరించిన డిక్ వేన్ డైక్ ను కొందరు మీ ఆరోగ్య రహస్యమేంటో చెప్పమని అడిగారట. ఇప్పటికీ పాతికేళ్ళ యువకునిలా పరుగులు తీసే డిక్ ఇచ్చిన సమాధానం చూసి విన్నవారికి కళ్ళు తిరిగాయట!
Udaya Bhanu: యాంకర్లకే రారాణి ఉదయ భాను.. ఇప్పుడెక్కడ..?
ఇంతకూ డిక్ వేన్ డైక్ తన ఆరోగ్యరహస్యం ఏం చెప్పాడో తెలుసా? రెగ్యులర్ ఎక్సర్ సైజ్ అన్నది ఒకటి. ఓస్… ఇది అందరూ చెప్పేదే కదా! అనవచ్చు. రెండోదే అసలు రహస్యమట! అదేమిటంటే మన వయసులో సగం ఉన్న భార్య ఉంటే ఎంచక్కా హుషారు మన సొంతం కాకమానదు అని సలహా ఇస్తున్నారు డిక్. ఈ సమాధానం విన్న హాలీవుడ్ జనం “ఓరి ముసలోడా…” అంటున్నారు. కానీ, “యస్ హీ ఈజ్ స్టిల్ యంగ్…” అనే వారూ లేకపోలేదు. అందాల తార, ఆస్కార్ అవార్డ్ విన్నర్ మెరిల్ స్ట్రీప్ సైతం డిక్ గురించి భలేగా చెబుతున్నారు. డిక్ తో కలసి 2018లో ‘మేరీ పాపిన్స్ రిటర్న్స్’లో మెరిల్ స్ట్రీప్ నటించారు. డిక్ లాంటి వారిని ఫిజికల్ ఏజ్ తో కాకుండా, మెంటల్ ఏజ్ తో చూడాలని అంటున్నారామె. నిజానికి డిక్ ఇప్పటికీ చిన్నపిల్లాడిలాగే మారాం చేస్తుంటాడనీ మెరిల్ స్ట్రీప్ చెబుతున్నారు.
Naveen Polishetty: స్వీటీతో ఎవడీ క్యూటీ..
డిక్ 1948లో మార్గీ విల్లెట్ ను వివాహమాడారు. దాదాపు మూడున్నర దశాబ్దాలు వారి సంసార నౌక సజావుతానే సాగింది. ఎందువల్లో 1984లో విడిపోయారు. అందుకు కారణం మిచెల్లీ ట్రియోలా మార్విన్ అనే నటితో డిక్ సావాసమే! భార్య విడాకులు తీసుకున్నా, డిక్ మాత్రం మిచెల్లీతో ఆమె కడదాకా కలసే ఉన్నారు. 2009లో మిచెల్లీ కన్నుమూశారు. 2012 నుండి ఆర్లిన్ సిల్వెర్ తో కలసి సాగుతున్నారు డిక్. ఆయన వయసు 97 సంవత్సరాలు కాగా, ఆర్లిన్ వయసు అందులో సగం, అంటే 49 ఏళ్ళు. ఆమె వల్లే తాను ఇంత హుషారుగా ఉన్నాననీ పదే పదే చెబుతున్నారు డిక్. మరి డిక్ చెప్పిన సలహాను ఎంతమంది హాలీవుడ్ బాబులు అనుసరిస్తారో చూడాలి.