HHVM : హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ వారం ముందు దాకా పెద్దగా అంచనాలు లేవు. ఎంత పవన్ సినిమా అయినా ప్రమోషన్లు చేయట్లేదనే అసంతృప్తి ఉండేది అభిమానుల్లో. కానీ ఎప్పుడైతే పవన్ రంగంలోకి దిగాడో సీన్ మారిపోయింది. వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో నాలుగు రోజుల్లో హైప్ తీసుకొచ్చేశాడు పవన్. అయితే ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలలో పవన్ చేసిన కామెంట్లు ఫ్యాన్స్ లో కదలికి తీసుకొచ్చింది. తన సినిమాను బాయ్ కాట్ చేయాలని చూస్తున్నారని.. ఎవరు ఏం చేసినా తన మూవీని ఆపలేరని.. తన వెనకాల తన ఫ్యాన్స్ ఉన్నారంటూ చెప్పాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పవన్ ఇవే కామెంట్స్ చేశాడు. ఇది పెద్ద రచ్చకు దారి తీసింది. సాధారణంగా సినిమాలకు బాయ్ కాట్ అనేది రేర్ గా వినిపిస్తుంది.
Read Also : Pawan Kalyan : ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పవన్ హీరోగా కంటిన్యూ..?
అది కొన్ని సినిమాలకు మాత్రమే కలిసొస్తుంది. ఇప్పుడు హరిహర వీరమల్లుకు బాగా కలిసొచ్చింది. అసలే పవన్ కల్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరాభిమానులు ఉన్నారు. పవన్ వీరమల్లు సినిమాను తొక్కేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. పవన్ నోటి నుంచి ఈ మాటలు రాగానే ఫ్యాన్స్ నుంచి భారీ రియాక్షన్ వచ్చింది. ఎంతలా అంటే ప్రీమియర్స్ షోలు అన్నీ హౌస్ ఫుల్ అయిపోయేంత. రేట్ ఎంతైనా టికెట్ కొనేసేంత. దెబ్బకు ప్రీమియర్స్ తోనే సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చేశాయి. పవన్ కల్యాణ్ ఎన్నడూ చేయనన్ని ప్రమోషన్లు ఈ మూవీ కోసం చేశాడు. అది కూడా పెద్ద ప్లస్ అయింది. పవనే ఇంత కష్టపడుతున్నాడు.. ఇంక మనం ఎందుకు ఊరుకోవాలి అనుకున్నారేమో ఆయన అభిమానులు. అందుకే ఆ రియాక్షన్ వసూళ్ల రూపంలో చూపించేశారు. మొత్తంగా చూస్తే బాయ్ కాట్ ట్రెండ్ వీరమల్లు సినిమాకు బాగానే హైప్ ను పెంచేసింది.
Read Also : Rakul Preet : ఓ వైపు వర్షాలు.. రకుల్ అందాల సోయగాలు..
