ఊర మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని #బోయపాటిరాపో అనే వర్కింగ్ టైటిల్‍తో తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ అంతా కూడా దాదాపు పూర్తయింది. సెప్టెంబర్ 15వ తేదీన ఈ మూవీని విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయినా ఇంత వరకు ఈ సినిమా టైటిల్‍ను మాత్రం వెల్లడించలేదు. ఈ మూవీకి ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేసి వుంటారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా బోయపాటి – రామ్ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‍కు తేదీ ఫిక్స్ అయింది.ఈ టైటిల్ విడుదల తేదీ వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించింది.మరో రెండు రోజుల్లో అంటే ‘జూలై 3న ఉదయం 11 గంటల 25 నిమిషాలకు’ ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ మేరకు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఓ ట్వీట్ ను చేసింది. “మాస్ మ్యాడ్‍నెస్‍ను మేము తీసుకొస్తున్నాం. మ్యాసివ్ ఎనర్జిటిక్ బోయపాటిరాపో టైటిల్ గ్లింప్స్‌ను జూలై 3వ తేదీ ఉదయం 11 గంటల 25 నిమిషాలకు తీసుకొస్తున్నాం” అని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ట్వీటర్ వేదికగా ట్వీట్ చేసింది. నీటిలో ఫైట్ చేస్తున్న రామ్ పోస్టర్‌ను పోస్ట్ చేసింది. ఈ పోస్టర్‌లో కత్తి పట్టుకున్న రామ్ విలన్లను తెగ నరుకుతున్నట్టుగా ఉంది. కాగా, ఈ చిత్రానికి స్కంద అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ఇప్పటికే రూమర్స్ వస్తున్నాయి. ఈ విషయంపై జూలై 3న అయితే స్పష్టత రానుంది.ఎనర్జిటిక్ స్టార్ రామ్‍కు ఈ సినిమాలో జోడీగా సెన్సెషనల్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.. ఎస్.ఎస్.థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బోయపాటి రామ్‍తో పిచ్చెక్కించే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను రూపొందిస్తున్నారు.బోయపాటి గతంలో తీసిన అఖండ సినిమా భారీ విజయం సాధించింది. సినిమాలో బాలకృష్ణ నట విశ్వరూపం చూపించారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం ను కురిపించింది. ఇప్పుడు రామ్ తో చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.