Allu Arjun: పవన్ గెలుపు.. అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun Congratulates Pawan Kalyan on His Victory: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుతో మెగా అభిమానులందరూ ఆనంద ఉత్సాహాలతో మునిగితేలుతున్నారు. ఇప్పటికే మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను కలిసే ప్రయత్నం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే హైదరాబాద్ నుంచి మంగళగిరి బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గెలుస్తున్న వార్తలు వస్తున్నప్పటి నుంచి సినీ ప్రముఖులు చాలామంది సోషల్ మీడియా వేదికగా ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తూనే కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక తాజాగా అల్లు అర్జున్ కూడా ఈ మేరకు ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కంగ్రాట్స్ ఇది ఒక అత్యద్భుతమైన విజయం.
Akira Nandan: పవన్ నివాసానికి భారీగా అభిమానులు.. దండం పెట్టి పంపిన అకీరా
Also Read
మీ హార్డ్ వర్క్, డెడికేషన్ ప్రజలకు సేవ చేయాలనే కమిట్మెంట్ ఎప్పుడూ గుండెకు హత్తుకునేలానే ఉంటాయి. ప్రజలకు సేవ చేసేందుకు మీరు మొదలు పెట్టిన కొత్త ప్రయాణానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అయితే అల్లు అర్జున్ మీద కొన్నాళ్ల క్రితం నుంచి పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నంద్యాలలో వైసిపి అభ్యర్థి గెలుపు కోసం ఆయన వెళ్లి ప్రచారం చేశారనే విషయం మీద జన సైనికులు ఆగ్రహంగా ఉన్నారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి తనకు స్నేహితుడు కావడంతో అక్కడికి వెళ్లి ఎలక్షన్స్ కి రెండు రోజుల ముందు బన్నీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.
Heartiest congratulations to @PawanKalyan garu on this tremendous victory . Your hardwork, dedication and commitment to serve the people for years has always been heart touching . Best wishes for your new journey to serve the people .
— Allu Arjun (@alluarjun) June 4, 2024
తాజావార్తలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!