Boyapati Srinu Clarity on Logics in his movies: బోయపాటి శ్రీను సినిమాలు చూసే వారందరికీ ఆయన సినిమాల్లో లాజిక్ లేని సీన్లు అసలు ఊహకు ఏమాత్రం అందని విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన స్కంద సినిమా చూసిన వారైతే అసలు ఇద్దరు ముఖ్యమంత్రులను అసలు ఏ మాత్రం బ్యాగ్రౌండ్ లేని ఒక వ్యక్తి ఎలా ముప్పతిప్పలు పెట్టాడు? అసలు ఆ సీన్లు బోయపాటి శ్రీను ఎలా తెరకెక్కించాడు? ఆ మాత్రం లాజిక్ కూడా లేదా అంటూ పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపించారు. అయితే తాజాగా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను తన సినిమాల్లో లాజిక్స్ గురించి క్లారిటీ ఇస్తూ తనను తాను కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. నిజానికి ఆయన రామ్ తో చేసిన స్కంద సినిమా అటు సక్సెస్ అని చెప్పలేం ఫెయిల్ అయిందని చెప్పలేము మిక్స్డ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కాస్త వెనకబడే ఉంది.
MP Navneet Kaur : మంత్రి రోజాకు మద్దతుగా నవనీత్ కౌర్.. సిగ్గు లేదా అంటూ బండారుపై ఆగ్రహం!
ఇక ఈ సినిమా చూసిన వారందరూ బోయపాటి శ్రీను ముఖ్యమంత్రి అంటే వీధి రౌడీలా భావిస్తున్నాడా ఏంటి? ఒక ట్రాక్టర్ వేసుకుని వెళ్లిన వ్యక్తి ముఖ్యమంత్రి ఇళ్ల మీద పడి విద్వాంసం సృష్టించడం ఏంటి? ఏమాత్రం అయినా నమ్మశక్యంగా ఉందా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయం మీద బోయపాటి శ్రీను స్పందిస్తూ ఇప్పుడు సినిమా అనేది ఒక ఊహ, ఒక కల ఏదో పెద్దగానే కందాం, చిన్న కలలు కనడం ఎందుకు అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రతిదీ లాజిక్ అని ఆలోచిస్తే కష్టమని సినిమాకి లాజిక్ అవసరం లేదని ఆయన తేల్చి చెప్పేశాడు. సినిమాలో కొన్ని సాంగ్స్ చేస్తాం కదా అవి హీరోలు హీరోయిన్లు రోడ్లమీద డాన్స్ చేస్తున్నట్లు చూపిస్తాం పాటల్లో. నిజంగా అవి అలాగే రోడ్డుమీద చేస్తే జనాలు రాళ్లు తీసుకుని కొడతారు, సినిమాలో కాబట్టి చూస్తూ ఎంజాయ్ చేస్తారు, నిజ జీవితంలో జరగని విషయాలన్నీ సినిమాల్లో జరుగుతున్నట్లుగా చూపిస్తాం, లాజిక్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదని బోయపాటి శ్రీను కామెంట్ చేశారు.