Boyapati Srinu: పట్టుమని పది సినిమాలు కూడా తీయకుండానే స్టార్ డైరెక్టర్ అయిపోయారు బోయపాటి శ్రీను. నవతరం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో చోటు దక్కించుకున్న బోయపాటి శ్రీను ఇప్పటి దాకా తొమ్మిది చిత్రాలు రూపొందించగా, అందులో మూడు సినిమాలు ఆట్టే ఆకట్టుకోలేక పోయాయి. దాంతో బోయపాటి సక్సెస్ రేటు 66.6 శాతం నమోదయింది.