ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఆ ఊహనే నిజం చేస్తూ బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కలిసి ఒక సినిమా చేస్తున్నారు. చాలా రేర్ గా సెట్ అయ్యే ఇలాంటి కాంబినేషన్ నుంచి ఎలాంటి సినిమా వస్తుంది అనే క్యురియాసిటి ప్రతి ఒక్కరిలో ఉంది. రామ్ పోతినేని ఇప్పటివరకూ చేసిన సినిమాలకి, బోయపాటి స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎలా మ్యాచ్ అవుతుంది అనే అనుమానాలకి ఎండ్ కార్డ్ వేసే రేంజులో ఒక మ్యాసివ్ టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. మే 15న రామ్ పోతినేని బర్త్ డే రోజున, ఈ ప్రాజెక్ట్ నుంచి టీజర్ ని రిలీజ్ చేయ్యనున్నట్లు ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిట్టూరి అనౌన్స్ చేశాడు.
ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న శ్రీనివాస్ చిట్టూరి, బోయపాటి శ్రీను-రామ్ పోతినేని ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ టీజర్ రిలీజ్ డేట్ ని చెప్పాడు. టీజర్ బయటకి వస్తుంది కానీ టీజర్ తో పాటు టైటిల్ ని మాత్రం రివీల్ చెయ్యట్లేదట. కేవలం టీజర్ ని మాత్రమే రిలీజ్ చేసి, టైటిల్ తర్వాత అకేషన్ చూసుకోని రిలీజ్ చెయ్యాలి అనేది మేకర్స్ ప్లాన్. అయితే టైటిల్ లేకుండా బయటకి రిలీజ్ చేసే కంటెంట్ టీజర్ అంత పెద్దగా ఉండే అవకాశం లేదు. జస్ట్ ఒక గ్లిమ్ప్స్ లా అఫీషియల్ వీడియోని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ వీడియో బయటకి వస్తే బోయపాటి శ్రీను-రామ్ పోతినేని కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుంది? ఏ రేంజులో ఉంటుంది అనే విషయాల్లో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.