Box Office War: వార్ ఫిక్స్… విజయ్ vs బాలయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలయ్య రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్ అవాల్సిందే. వచ్చే దసరాకు కూడా అదే జరగబోతోంది. ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం బాలయ్యకు గట్టిపోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలయ్య… ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ సినిమా, జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే గ్లింప్స్‌తో బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్లు, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ అదిరిపోతుందని చెప్పేశారు మేకర్స్. ఇక ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ రిలీజ్ డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు. దీంతో తాజాగా భగవంత్ కేసరి రిలీజ్ డేట్ లాక్ చేశారు. అక్టోబర్ 19న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు సాలిడ్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. దీంతో దసరాకు బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ ఫిక్స్ అయిపోయింది.
అక్టోబర్ 20న మాస్ మహారాజా నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్ కాబోతోంది కానీ ఈ ప్రాజెక్ట్ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ అక్టోబర్ 19న రిలీజ్ కాబోతోంది. విజయ్‌కు తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోయినా.. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు కాబట్టి భారీ అంచనాలున్నాయి. గతంలో లోకేష్ నుంచి వచ్చిన ఖైదీ, విక్రమ్ సినిమాలు ఇక్కడ భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో దసరా వార్ విజయ్ వర్సెస్ బాలయ్యగా మారనుంది. అయినా బాలయ్య క్రేజ్ ముందు విజయ్‌కి కాస్త కష్టమేనని చెప్పొచ్చు. కానీ ఒకవేళ రవితేజ కూడా సై అంటే మాత్రం.. ముగ్గురి మధ్య గట్టి పోటీ తప్పదనే చెప్పాలి. మరి ఈ ముగ్గురిలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
NBK 112: 150 కోట్లతో బాలయ్య-కొరటాల మాస్ బ్లాక్ బస్టర్
-
Bhatti Vikramarka : కేసీఆర్ అప్పులపై భట్టి బిగ్ బాంబ్..!
-
Nirav Modi: నీరవ్ మోడీకి బిగ్ షాక్.. రూ.100 కోట్లు కట్టాల్సిందేనని లండన్ కోర్టు సంచలన తీర్పు!
-
Rainfall Deficit: ఖరీఫ్ సీజన్‌కు రుతుపవనాల సెగ.. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం..
-
Asim Munir: అసిమ్ మునీర్ హత్యకు కుట్ర.. మొసాద్ హిట్ లిస్టులో పాక్ ఆర్మీ చీఫ్..
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!