అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బీటౌన్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. వరుస సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక తన గ్లామర్ తో యూత్ దృష్టిని తనవైపుకు తిప్పుకోవడంలో ఆమెకు ఆమే సాటి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే జాన్వీ ఫోటోలు చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇక జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా రూమర్స్ విన్పిస్తున్నాయి. ఇటీవల కాలంలో ‘ఎన్టీఆర్ 30’తో జాన్వీ తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయంపై తాజాగా ఆమె తండ్రి బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు.
Read Also : Kalaavathi Song : డ్యాన్స్ అదరగొట్టేసిన తమన్… వీడియో వైరల్
నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన “వలీమై” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బోనీ కపూర్ మాట్లాడుతూ జాన్వీ ఆమె తల్లి శ్రీదేవి వారసత్వాన్ని కొనసాగిస్తుందని, మంచి స్క్రిప్ట్, డైరెక్టర్ ఉంటే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటిస్తుందని వెల్లడించారు. ఇక ‘ఎన్టీఆర్ 31’ రూమర్స్ గురించి మాట్లాడుతూ ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి నన్నెవరూ కలవలేదు. సోషల్ మీడియాను ఫాలో అయితే పిచ్చోళ్ళు కావడం ఖాయమని అన్నారు. ఇక అజిత్ హీరోగా, హ్యూమా ఖురేషి, కార్తికేయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వలీమై’ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 24న తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.