Sohel: రీ రిలీజులపై సొహైల్ సంచలన కామెంట్స్.. చిన్న సినిమాలను బతికంచండని వేడుకోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Syed Sohel striking comments on telugu re-release movies: సయ్యద్ సొహైల్ రియాన్, రూప కొడువాయూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా నిన్న (శుక్రవారం) థియేటర్ లలో రిలీజైంది. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. . ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్ లో అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించగా కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించారు. ఈ సందర్భంగా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో సోహైల్ మాట్లాడుతూ నేను పదహారేళ్లుగా ఇండస్ట్రీలో పడుతున్న కష్టానికి ఇవాళ ఫలితం దక్కిందని అనుకుంటున్నానని, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ కు వచ్చిన ప్రతి రివ్యూలో సోహైల్ బాగా నటించాడని రాశారని అన్నారు.. నేనొక నటుడిని అని గుర్తింపు దక్కినందుకు సంతోషంగా ఉందన్న ఆయన సిటీలో మల్టీఫ్లెక్స్ వెళ్లి చూశా, సినిమా చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులు బాగా నటించావు అంటూ హగ్ చేసుకుంటున్నారని అన్నారు.
Jailer Collections: ఒకసారి పరువు తీశారు..మళ్ళీ మారక పోతే ఎలా?
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ఒక మంచి సినిమా చేశామని చెబుతున్నారని, పబ్లిక్ టాక్ వినండి, ఏ ఒక్కరూ నెగిటివ్ గా చెప్పలేదని అన్నారు.. అక్కడే మేము సక్సెస్ అయ్యాం అయితే యూట్యూబ్ లో కొందరు స్పాయిలర్స్ సినిమాల మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని, దయచేసి సినిమా రిలీజైన వెంటనే ఆ సినిమాను దెబ్బతీసే వీడియోలు చేయకండి. మీ వల్ల సినిమా కోసం పనిచేసే ఎంతోమంది నష్టపోతారని గుర్తుపెట్టుకోండి అని అన్నారు. ఇక ఈ సాయంత్రం పోస్ట్-రిలీజ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సినిమాల రీ రిలీజులపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సయ్యద్ సోహెల్ మాట్లాడుతూ నిర్మాతలు, పంపిణీదారులు అలాగే అభిమానులను పాత సినిమాలను రీ రిలీజ్ చేసేప్పుడు వీకెండ్స్ చేయవద్దని కోరారు. వారాంతాల్లో పెద్ద సినిమాలను తిరిగి విడుదల చేయవద్దని సోహెల్ టాప్ టాలీవుడ్ స్టార్ హీరోల పంపిణీదారులు, అభిమానులను కోరారు. “దయచేసి వారాంతాల్లో ఎలాంటి రీ-రిలీజ్‌ని ప్లాన్ చేయవద్దు, ఎందుకంటే పెద్ద హీరోలు నటించిన పెద్ద సినిమాల చుట్టూ ఉన్న హైప్ చాలా కష్టాల తర్వాత చిన్న సినిమాలు సృష్టించే చిన్న హైప్ ని నాశనం చేస్తుంది. వీక్ డేస్‌లో రీ-రిలీజ్‌లను ప్లాన్ చేసి, చిన్న సినిమాల కోసం వీకెండ్స్ వదిలివేయమని నేను ప్రతి ఒక్కరినీ వినమ్రంగా కోరుతున్నాను, ”అని సోహెల్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!