Govinda: 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. మనసులోని బాధ బయటపెట్టిన గోవింద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govinda: 90వ దశకంలో బాలీవుడ్‌ను తన కామెడీ, డ్యాన్స్, స్టైల్ తో ఏలిన స్టార్ హీరో గోవింద మరోసారి వెండితెరపైకి రాబోతున్నారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘రూపా’ ను ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో నటి రాణి స్వర్ణకర్ బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న గోవింద, తన రీఎంట్రీతో పాటు కెరీర్లో ఎదుర్కొన్న కష్టాలు, బాలీవుడ్ రాజకీయాలు, దక్షిణాది సినిమాల ప్రభావంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గోవింద మాట్లాడుతూ.. తాను పేదరికం నుంచి వచ్చిన వ్యక్తినని, చిన్నప్పటి నుంచి కుటుంబ బాధ్యతలే తనకు ముఖ్యమని, అందుకే అవకాశాల కోసం ఎప్పుడూ ఎదురు చూసేవాడినని వెల్లడించారు. డబ్బు విలువను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా, కుటుంబాన్ని సంతోషంగా ఉంచడమే తన మొదటి లక్ష్యమని పేర్కొన్నారు. పెద్ద పెద్ద సినీ ప్రముఖుల నుంచి అవకాశాలు ఎక్కువగా రాలేదని, అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాను ఎప్పుడూ భావించానని చెప్పారు.
ఇక దక్షిణాది చిత్రసీమ గురించి కూడా గోవింద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాబోయే పదేళ్లు దక్షిణాది సినిమాలపై దృష్టి పెడతానని వెల్లడించారు. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘వాంటెడ్’, అలాగే అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి హీరోలు నటించిన రీమేక్ చిత్రాల విజయాలను ప్రస్తావిస్తూ, దక్షిణాది కథలు హిందీ సినిమాలకు కొత్త ఊపునిచ్చాయని అన్నారు. ఈ సినిమాల వల్ల ఎంతో మంది హీరోలకు భారీ విజయాలు వచ్చాయని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ రాజకీయాలపై కూడా గోవింద తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తనను ఇండస్ట్రీలో చాలాసార్లు పట్టించుకోలేదని, ఇకపై సినిమాల్లో కనిపించరని కూడా చాలామంది భావించారని అన్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లోనూ తాను వెనక్కి తగ్గలేదని, మళ్లీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించానని చెప్పారు. ప్రేక్షకులు మరోసారి తనను ఆదరిస్తారనే నమ్మకం ఉందని, ఈ సినిమా తాను మంచి విజయాన్ని అందుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత గోవింద మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అభిమానుల్లో కూడా ఈ సినిమా మీద ఆసక్తి పెరుగుతోంది. ఒకప్పుడు బాలీవుడ్లో వరుస బ్లాక్ బస్టర్లతో నెంబర్ వన్ హీరోగా నిలిచిన ఆయన, ఇప్పుడు ‘రూపా’తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.
Also Read
- Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
- Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
- Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
- ChiranjeeviOdela : 'ప్యారడైజ్' రిజల్ట్‌పైనే చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
తాజావార్తలు
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!