కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 2023 జనవరి క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ వినాయక చవితికి క్లియర్ చేసే పనిలో ఉన్నాడు. పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టిన షారుఖ్, ఇప్పుడు జవాన్ సినిమాతో వెయ్యి కోట్ల మార్క్ ని క్రాస్ చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే 930 కోట్ల గ్రాస్ ని రాబట్టిన షారుఖ్ ఖాన్, ఈ వీక్ ఎండ్ కి 1000 కోట్ల మార్క్ ని రీచ్ అవ్వనున్నాడు. ఫాస్టెస్ట్ హండ్రెడ్ క్రోర్ గ్రాసర్ గా జవాన్ సినిమా చరిత్ర సృష్టిస్తుంది. ఈ మూవీని సౌత్ సెన్సేషన్ అట్లీ సూపర్బ్ గా మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా డైరెక్ట్ చేసాడు. జవాన్ చూసిన వాళ్లకి ఇది పక్కా సౌత్ సినిమా అనిపించకమానదు. అందుకే నార్త్ లోనే కాదు సౌత్ లో కూడా జవాన్ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఓవరాల్ గా ఇప్పటివరకు సౌత్ లో జవాన్ సినిమా 70 కోట్ల వరకూ రాబట్టింది, ఒక హిందీ సినిమా సౌత్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టడం ఇదే మొదటిసారి. జవాన్ సినిమా సౌత్ లో సూపర్ హిట్ అవ్వడానికి కారణం అట్లీ, నయనతార, విజయ్ సేతుపతిలకి ఉన్న స్టార్ డమ్ కూడా. ఈ ముగ్గరు జవాన్ సినిమా సౌత్ కలెక్షన్స్ ని చాలా హెల్ప్ అయ్యారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ మీడియా నయనతార గురించి పబ్లిష్ చేస్తున్న కొన్ని ఆర్టికల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జవాన్ సినిమా విషయంలో నయనతార అప్సెట్ గా ఉందని, ఆమె పోర్షన్స్ ని కట్ చేసారని, దీపికా హైలైట్ అయ్యేలా జవాన్ సినిమాని కట్ చేయడంతోనే నయన హార్ట్ అయ్యిందని బాలీవుడ్ మీడియా అంటుంది. నిజానికి ఇది దీపికాకి క్రెడిట్స్ ఇవ్వడానికి బాలీవుడ్ మీడియాలో చేస్తున్న పని. ఎందుకంటే జవాన్ సినిమాని చూసిన నార్త్ వాళ్లు నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ కి ఫిదా అయ్యారు. అట్లీ ఆమె క్యారెక్టర్ ని చాలా బాగా డిజైన్ చేసాడు అందుకే ఆడియన్స్ ఆ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే జవాన్ సినిమా డైలీ కలెక్షన్స్ ని, ఏ ఇండస్ట్రీ పర్సన్ జవాన్ సినిమాని పొగిడినా నయనతార దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోని మరీ ఇన్స్టాలో పోస్ట్ చేసి థాంక్స్ చెప్తుంది. జవాన్ సినిమా సక్సస్ ని నయన్ కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తుంది. ఇలాంటి సమయంలో బాలీవుడ్ మీడియా సౌత్ హీరోయిన్ పై నెగటివ్ ప్రచారం చేయడం బాధాకరం.