యాక్షన్ అడ్వైంచర్స్, మాస్ మసాలా సినిమాలతో కాకుండా హారర్ కామెడీలతో హవా చూపించింది నార్త్ బెల్ట్. త్రీ ఖాన్స్ లేకపోవడంతో ఆ ప్లేసును భర్తీ చేశాయి దెయ్యాల స్టోరీలు. 2024లో భయపెట్టే సినిమాలే బాక్సాఫీస్ బెండు తీశాయి. హయ్యెస్ట్ గ్రాసర్లుగా నిలిచాయి. 2024లో బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించాయి హారర్ కామెడీస్. అందులో ఫస్ట్ వరుసలో నిలుస్తుంది స్త్రీ2. స్త్రీకి సీక్వెల్ గా తెరకెక్కించాడు అమర్ కౌశిక్. శ్రద్దాకపూర్, రాజ్ కుమార్ రావ్ జంటగా నటించిన ఈ మూవీ భయపెట్టడంతో పాటు కితకితలు పండించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా శ్రద్దాకపూర్ ఇమేజ్ డబులయ్యింది. రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసి హయ్యెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది 2024గా నిలిచింది.
Also Read : DilRaju : 5 పాటలు రూ. 75 కోట్ల ఖర్చు.. శంకర్ మార్క్
స్త్రీ 2 నిర్మాణ సంస్థ మెడ్డాక్ ఫిల్మ్ నుండి వచ్చిన మరో హారర్ మూవీ ముంజ్య. విజువల్ వండర్స్ తో భయపెట్టింది. దినేష్ విజయన్ తో పాటు స్త్రీ 2 డైరెక్టర్ అమర్ కౌశిక్ ఈ సినిమాను నిర్మించారు. జస్ట్ రూ. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ రూ. 130 కోట్లను పైగా కొల్లగొట్టింది. ఇదే కాదు లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో వచ్చిన భూల్ భూలయ్యా 3కూడా భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్ మూవీ సింగం ఎగైన్ తో పోటీ తట్టుకుని కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. లాస్ట్ బట్ నా లీస్ట్ సైతాన్. ఎన్సో ఇయర్స్ తర్వాత బాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మాధవన్ ఫెర్మామెన్స్ టాప్ నాచ్. అతీంద్రియ శక్తులతో ఫైట్ చేస్తోన్న కూతుర్ని కాపాడుకునేందుకు ఓ ఫ్యామిలీ చేసిన పోరాటమే సైతాన్. రూ. 60 కోట్లతో నిర్మిస్తే రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకొంది. మొత్తానికి హారర్ చిత్రాలు 2024ని ఆక్యుపై చేయడంతో పాటు సక్సీడ్ అయ్యాయి.