టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో వెబ్ సిరీస్ లో నటిస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సామ్ ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది.. దీనికోసం గతరాత్రి అమ్మడు ముంబైకి వెళ్ళింది. మీటింగ్ అనంతరం వరుణ్ ధావన్ తో సామ్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఒక్కసారిగా ఫొటోగ్రాఫర్లు, అభిమానులు వారిని చుట్టుముట్టడంతో సామ్ భయపడిపోయింది.
ఇక దీంతో వరుణ్ ధావన్, సామ్ ని చెయ్యిపట్టుకోని ముందుకు నడిపించాడు.. సామ్ ని ఎందుకు భయపెడుతున్నారు అంటూ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో కింద నెటిజన్లు కామెంట్లు కురిపించడం మొదలుపెట్టారు. కొంతమంది వరుణ్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొంతమంది సామ్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.. వరుణ్ కి ఈ మధ్యనే పెళ్లయింది .. వారిద్దరి మధ్య చిచ్చు పెట్టకు.. అని ఒక నెటిజన్ అనగా.. మరొక నెటిజన్.. బాలీవుడ్ ని చూసి బయపడుతున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
