బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమందు సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే స్టేడియం లో నగ్నంగా తిరుగుతాను అని సంచలన ప్రకటన చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన అమ్మడు నిత్యం ఏదో ఒక వివాదంతో నెటిజన్ల నోళ్ళల్లో నానుతూనే ఉంటుంది. ఇక ఇటీవల పెళ్లి చేసుకున్న మూడు నెలలకే భర్త వేధిస్తున్నాడని పోలీస్ కేసు పెట్టి విడిపోయిన ఈ భామ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన మనసులో మాటను బయటపెట్టింది. తాను వివాదంగా చేసిన వ్యాఖ్యలన్నీ పబ్లిసిటీ స్టంట్ అంటూ బాంబు పేల్చింది.
” బాలీవుడ్ లోకి నేను చిన్నతనంలోనే ఎంట్రీ ఇచ్చాను. కానీ, ఎప్పుడు అందరు నన్ను గుర్తించాలని కోరుకొనేదాన్ని. అందుకోసమే బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చేదాన్ని. స్టేడియం లో నగ్నంగా తిరుగుతాను అని చెప్పింది కూడా పబ్లిసిటీ స్టంట్ లాంటిదే. అయితే అలా చెప్పినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నా సినిమాలు నా తల్లిదండ్రులకు నచ్చలేదు. అందులో నటించినందుకు వారు నన్ను దారుణంగా కొట్టేవారు. ఇండస్ట్రీలోకి అడుగుపెడితే వెంటనే అవకాశాలు రావు.. ఎన్నో ఏళ్ళు ఎదురుచూడాల్సివస్తుంది. అప్పటివరకు మనమీద మనకు నమ్మకం ఉంచుకోవాలని” ఇండస్ట్రీకి వచ్చేవారికి సలహాలు కూడా ఇస్తోంది.