టాలీవుడ్ యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శ్రీను చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో భారీ విజయం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇది కాకుండా ప్రస్తుతం శ్రీనివాస్ బాలీవుడ్ లో పాగా వేయడానికి చాలా కష్టపడుతున్నాడు. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఛత్రపతి చిత్రాన్ని హిందీలో శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం విదితమే. టాలీవుడ్ లో హీరోగా లాంచ్ చేసిన మాస్ డైరెక్టర్ వివి వినాయక్.. ఇప్పుడు అతన్ని హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ పెద్ద హీరోయిన్లను నటించింపజేయాలని మేకర్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెల్సిందే. అయితే శ్రీనివాస్ సరసన ఏ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించడానికి ఆసక్తి చూపించడం లేదని టాక్.
ఇక ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భరుచ్చా ను కథానాయికగా ఎంపిక చేసినట్లు మేకర్స్ తెలిపారు. నేడు అమ్మడి పుట్టినరోజు కావడంతో మేకు బర్త్ డే విషెస్ తెలుపుతూ సినిమాలోకి ఆహ్వానించారు. నుష్రత్ హిందీలో ‘ప్యార్ కా పంచ్నామా’ ‘ప్యార్ కా పంచ్నామా 2’ ‘సోనూ కే టిటు కి స్వీటీ’ వంటి చిత్రాలతో అలరించింది. ఇక ఇటీవలే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన విషయం విదితమే. ‘జన్ హిత్ మే జారీ’ చిత్రంలో ఆమె వీధి వీధి తిరిగి కండోమ్స్ అమ్మే అమ్మాయిగా కనిపించింది. దీంతో ట్రోలర్స్ ఆమెపై విమర్శలు గుప్పించారు. అయితే అలాంటివేమీ పట్టించుకోనని, పాత్ర బావుంది కాబట్టే చేశానని చెప్పి అందరి నోర్లు మూయించిన ఈ బ్యూటీ ఈ సినిమాతో బంపర్ ఆఫర్ పట్టేసింది. తెలుగులో శ్రీయ చేసిన పాత్రలో నుష్రత్ కనిపించనుంది. మరి ఈ సినిమాతో ఈ అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Happiest Birthdayyy @Nushrratt 🤗 wishing you all the happiness, love and success always! 😊 pic.twitter.com/WumKEh981s
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) May 17, 2022