NTV Telugu Site icon

Kanishka Soni: శృంగారానికి మగాడు అక్కర్లేదట.. తనను తానే పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి..!!

Kanishka Soni

Kanishka Soni

Kanishka Soni: ప్రముఖ బాలీవుడ్ నటి కనిష్క సోనీ సంచలన వ్యాఖ్యలు చేసింది. పవిత్ర రిష్తా, దియా ఔర్ బాతి హమ్ లాంటి టీవీ షోలతో పాపులర్‌ నటిగా పేరు సంపాదించిన కనిష్క సోనీ తనను తానే వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోను అభిమానులకు షేర్ చేసింది. ఈ మేరకు సదరు ఫోటోలో ఆమె మెడలో తాళిబొట్టు, నుదుటున సిందూరం కనిపిస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందాయని.. కానీ ఈరోజుల్లో శృంగారం చేయాలంటే ఆడవాళ్లకు పురుషులు అవసరం లేదని భావిస్తున్నానని కనిష్క సోనీ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెను నెటిజన్‌లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. జీవితంలో మగాడి తోడు లేకుండా ఎలా బతుకుతావంటూ నిలదీస్తున్నారు.

Read Also: Chiranjeevi Hospital: సినీ కార్మికుల కోసం కొణిదెల ఆస్పత్రి.. ఛారిటీ కోసం తమన్ మ్యూజిక్ ఈవెంట్

కాగా తాను గుజరాత్‌కు చెందిన సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానని.. తనకు పెళ్లి చేసుకోవాలని ఎంతో కోరికగా ఉందని.. అయితే మాట మీద నిలబడే పురుషులను తన జీవితంలో చూడలేదని.. అందుకే పురుషుడు లేకుండానే తన జీవితం గడపాలని నిర్ణయించుకున్నట్లు కనిష్క సోనీ వివరించింది. తన కలలు, అవసరాలను సొంతంగా తానే తీర్చుకోగలనని వ్యాఖ్యానించింది. మహాబలి హనుమాన్ వంటి టీవీ షోలో దేవి పాత్రను పోషించినా తనను ఎవరూ పట్టించుకోలేదని.. కానీ ఈరోజు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎంతోమంది తనకు ఫాలోవర్లు ఉన్నారని తెలిపింది. ఇప్పుడున్న సమాజంలో వివాహం చేసుకున్న మహిళల్లో 90 శాతం మంది సంతోషంగా లేరని.. అలాంటప్పుడు తాను మగాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. ప్రజలు ఏమనుకుంటారో అని సందేహించి గతంలో ఐటం సాంగ్‌లలో అవకాశాలను సైతం వదులుకున్నట్లు కనిష్క సోనీ వెల్లడించింది. ప్రజలను తానెప్పుడూ ఇబ్బంది పెట్టలేదని.. అయినా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొంతమంది జోక్యం చేసుకోవడం తనకు నచ్చలేదని తెలిపింది. తనను తాను ప్రేమించడం తప్పేమీ కాదని తన అభిప్రాయంగా పేర్కొంది.

Show comments