Sharad Kapoor: రెండేళ్లుగా స్నానం లేదు.. మంచం దిగలేదు.. దయనీయ దుస్థితిలో బాలీవుడ్ నటుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటుడు శరద్ కపూర్ నేడు అత్యంత దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. షారుఖ్ ఖాన్ ‘జోష్’, ‘లక్ష్య’, ‘వాంటెడ్’, ‘జై హో’ వంటి భారీ చిత్రాల్లో నటించిన ఈ నటుడు, గత రెండేళ్లుగా కనీసం స్నానం కూడా చేయకుండా, మంచానికే పరిమితమై నరకయాతన అనుభవిస్తున్నారనే వార్త ఇప్పుడు సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ‘బేజుబాన్ ట్రస్ట్’ పేరుతో జంతు సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న హేమ చౌదరి, ఇటీవల ఒక పాడ్కాస్ట్లో శరద్ కపూర్ దుస్థితిని బయటపెట్టారు. ఆ ప్రాంతంలో వీధి కుక్కలను రక్షించేందుకు వెళ్లిన హేమకు, అనుకోకుండా శరద్ కపూర్ పరిచయమయ్యారు. ఆయన గదిలోకి వెళ్లి చూసిన హేమ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. రెండేళ్లుగా స్నానం చేయకపోవడం, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఆయన మంచంపైనే పడి ఉండటం చూసి చలించిపోయారు. ఆయన కాళ్లు కూడా వంకరపోయి, ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని గుర్తించి ఈ విషయాన్ని బయటపెట్టినట్లు ఆమె తెలిపారు.
శరద్ కపూర్ దీనస్థితిపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో కొందరు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే, ఇక్కడే మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కొంతమంది కేవలం రీల్స్, వీడియోలు తీసుకోవడానికి మాత్రమే ఆయన చేతిలో డబ్బులు పెట్టి, కెమెరా ఆఫ్ చేయగానే ఆ డబ్బును తిరిగి లాక్కున్నారని స్వయంగా శరద్ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న తనను చూపిస్తూ కొందరు పబ్లిసిటీ స్టంట్లు చేయడం తనను తీవ్రంగా బాధించిందని ఆయన వాపోయారు. ఆయన కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు హేమ చౌదరి ప్రయత్నించినప్పటికీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆస్తి వివాదాలు లేదా కుటుంబ కలహాల వల్లే ఆయనను ఒంటరిగా వదిలేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు మనవరాలు కోయల్ బసుతో ఆయనకు నిశ్చితార్థం జరిగినప్పటికీ, వ్యక్తిగత కారణాలతో పెళ్లి జరగలేదు. ప్రస్తుతం శరద్ కపూర్ మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. విషయం తెలుసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, రియల్ హీరో సోనూ సూద్ తదితరులు ఆయనను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. 2019లో వచ్చిన ‘క్యాబరే’ చిత్రం తర్వాత వెండితెరకు దూరమైన శరద్ కపూర్, త్వరలోనే కోలుకుని తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read
- Shivathmika Rajasekhar: నాకు సినిమాలంటే పిచ్చి.. "రేపు నా కల నిజమవుతోంది"!
- Varanasi: రాజమౌళి - మహేశ్ 'వారణాసి'కి ఐపీఎల్ గండం.. ఏప్రిల్ 7న రావడం కష్టమేనా?
- Cyber Fraud: టాలీవుడ్ నటికి సైబర్ షాక్.. రూ.4.14 లక్షలు స్వాహా!
- Chiranjeevi: నాతో సినిమా చేస్తావా అని ఏ డైరెక్టర్ని అడగలేదు.. ఈ దుర్మార్గుడు హ్యాండిచ్చాడు!
తాజావార్తలు
-
Sharad Kapoor: రెండేళ్లుగా స్నానం లేదు.. మంచం దిగలేదు.. దయనీయ దుస్థితిలో బాలీవుడ్ నటుడు
-
Akash Chopra: ధోనీని దుర్భాషలాడిన CSK స్టార్ ప్లేయర్.. ఆ సమయంలో జరిగింది ఇదే..
-
Telangana Darshini: తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ బంపర్ ఆఫర్..
-
Voyager 1: చరిత్ర సృష్టించిన వయోజర్-1 .. నేటితో ‘‘ఒక కాంతి రోజు’’ దూరంలోకి..
-
Shivathmika Rajasekhar: నాకు సినిమాలంటే పిచ్చి.. “రేపు నా కల నిజమవుతోంది”!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..