Bittiri Satti: బిత్తిరి సత్తి.. ఈ పేరు వినని వారుండరు. ప్రస్తుతం ఏ సినిమా ప్రమోషన్స్ జరిగినా బిత్తిరి సుత్తితో ఇంటర్వ్యూ జరగాల్సిందే. ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా మొదలుపెట్టిన రవి కుమార్.. బిత్తిరి సత్తిగా మారిన విధానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇక ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న సత్తి తాజాగా కాస్ట్లీ కారును కొనుగోలు చేశాడు. అది కూడా అల్లాటప్పా కారు కాదు.. స్టార్ రేంజ్ ఉండే రేంజ్ రోవర్. ఈ కారు ధర రూ. 2.50 నుంచి రూ. 4 కోట్ల వరకు ఉంటుందని టాక్ నడుస్తోంది. బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ తో బిత్తిరి సత్తి దిగిన ఫోటోలు ప్రస్తుతం అంతర్జాలంలో హల్చల్ చేస్తున్నాయి. ఈ కారును చూసినవారందరు రేంజ్ రోవర్ కొనే స్థాయికి బిత్తిరి సత్తి ఎదిగాడంటే రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది.
ఒక న్యూ స్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన చేవెళ్ల రవి.. తనదైన స్లాంగ్, మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తీన్మార్ వార్తలు అనే షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న రవి.. బిత్తిరి సత్తిగా మారిపోయాడు. ఇక ఈ షో తో అతడు వెనుతిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం బిత్తిరి సత్తి యాంకర్ గానే కాదు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ రేంజ్ లో సంపాదిస్తే రేంజ్ రోవర్ ఏంటి.. ఏదైనా కొనొచ్చు అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.