Bimbisara Release Trailer: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో క్యాథరిన్ ధెరిస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ లో బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం చూపించాడు. “హద్దులను చెరిపేస్తూ మన రాజ్యపు సరిహద్దులను ఆపే రాజ్యాలను దాటి వేస్తూ విస్తరించాలి.. శరణు కోరితే ప్రాణ భిక్ష..ఎదిరిస్తే మరణం” అంటూ బేస్ వాయిస్ తో కళ్యాణ్ రామ్ డైలాగ్ తో ట్రైలర్ ఆరంభమయ్యింది.
రెండు విభిన్న పాత్రల్లో కళ్యాణ్ రామ్ నటన ఆకట్టుకొంటుంది. నాడైనా, నేడైనా త్రిగర్తల చరిత్రను దాటాలంటే ఈ బింబిసారుడి కత్తిని దాటాల్సిందే లాంటి డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇప్పటివరకు చూడని ఒక సోషియో ఫాంటసీని అభిమానులు చూడబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇక అదరగొట్టే విజువల్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. ముఖ్యంగా కీరవాణి మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలవనున్నదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాంటి హిట్ ను అందుకోనున్నాడో చూడాలి.