Vijay Antony: బిచ్చగాడు చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోని. ఆ తరువాత కొన్ని సినిమాలతో ప్రేక్షకులను పలకరించినా వాటిలో గుర్తుపెట్టుకొనేవి తక్కువే అని చెప్పాలి. ఇక ఈసారి తనను ఆదరించిన సినిమాతోనే విజయ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే బిచ్చగాడు 2. విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మధ్యనే ఈ సినిమా సెట్ లో విజయ్ ప్రమాదానికి గురైన సంగతి తెల్సిందే. ఆయన పూర్తిగా కోలుకోకుండానే ఈ సినిమాను పూర్తిచేసేపనిలో పడ్డాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. బిచ్చగాడు 2 అని అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ప్రతి పోస్టర్ లో బికిలీ.. అనో.. యాంటీ బికిలీ అనో యాడ్ చేస్తున్నారు. అసలు ఈ పదాలకు అర్ధం ఏంటి..? ఏ భాష ఇది అనేది మాత్రం ఎవరికి అంటూ చిక్కనిది. ఈ మధ్యనే రిలీజ్ చేసిన టీజర్ లో కూడా ఈ పదాలను ఉపయోగించారు.
Sonali Kulkarni: అమ్మాయిలకు అది ఎక్కువైంది.. అవసరాలు తీర్చే బాయ్ ఫ్రెండ్ కావాలి
ఇక తాజాగా ఆ పదాలకు అర్ధం చెప్పేశాడు విజయ్. బికిలీ అనే మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేస్తూ అందులో ఆ పదాల గురించి చెప్పుకొచ్చాడు. “నమస్కారం. నేను మీ విజయ్ ఆంటోనీని మాట్లాడుతున్నాను. నేను చాలా బాగా ఆలోచించి ఆలోచించి.. ఒక చెడ్డ పదం కనిపెట్టాను. చెడ్డ పదం అంటే మీరనుకొనేవిధంగా మాట్లాడడానికి అసహ్యంగా ఉండే పదం కాదు.. వినేవాళ్లకు అది అసహ్యంగా ఉండే పదం. నేను కనిపెట్టిన ఆ కొత్తపదం పేరు బికిలీ. పేదవాళ్ల పేదరికాన్ని ఉపయోగించుకొని తన దగ్గర ఉన్న ధన బలంతో వాళ్ళ పొట్టనుకొట్టి, వాళ్ళను బానిసలుగా మర్చి.. డబ్బు ఉందన్న అహంకారంతో తిరిగేవాడే బికిలీ. అలాంటివారిని ఇకనుంచి బికిలీ అనే పదంతో పిలవచ్చు. ఈరోజు నుంచి నేను కనిపెట్టిన ఈ బికిలీ పదం భారతదేశంలో వాడకంలోకి వస్తుంది.” అంటూ చెప్తూ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ సాంగ్ కు భాష్యశ్రీ లిరిక్స్ అందించగా.. విజయ్ ఆంటోనీనే సంగీతం అందించి సాంగ్ ను ఆలపించాడు. ప్రస్తతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక బికిలీ అంటే చెడ్డ పదం అని అర్ధమయ్యింది. మరి యాంటీ బికిలీ అంటే.. అలా పేదవారి సొమ్మును కాజేసే వారి అంతు చేసేవాడే యాంటీ బికిలీ అన్నమాట. పదాలు బావున్నాయి.. విజయ్ ప్రమోషన్స్ బావున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.