బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎంతటి ప్రేక్షకాదరణ చూరగొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంటెస్టెంట్ల్ మధ్య గొడవలు, రొమాన్స్, టాస్క్ లు అబ్బో ఒకటని ఏముంది గంటసేపు ఇంటిల్లిపాదినీ కూర్చోపెట్టి ఎంటర్ టైన్మెంట్ ని అందిస్తోంది. ఇక తాజాగా సీజన్ 6 తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది బిగ్ బాస్. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఈసారి గంట కాదు 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ లో బిగ్ బాస్ ని చూడొచ్చు.. అంటే బిగ్ బాస్- నాన్ స్టాప్ ఓటిటీ లో.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ రియాలిటీ షో 24 గంటలు ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ షో నుంచి రిలీజైన పోస్టర్స్ కి విశేష స్పందన వచ్చింది. ఇక తాజగా ప్రోమో ని మేకర్స్ రిలీజ్ చేశారు. నాగార్జున, వెన్నెల కిషోర్, మురళి శర్మ ఈ ప్రోమోలో కనిపించారు. వెన్నెల కిషోర్ కి పిక్ పాకెట్ కేసులో ఉరి శిక్ష పడుతోంది.
పోలీస్ అయిన మురళి శర్మ, వెన్నెల కిషోర్ కి ఉరి వేయడానికి తీసుకెళ్తుండగా.. లాయర్ అయిన నాగార్జున ఎదురవుతాడు. ఇక ఉరి శిక్ష పడ్డ ఖైదీకి చివరి కోరిక ఏంటి అని అడగగా బిగ్ బాస్ చూడాలని ఉందని నాగ్ చెప్తాడు,. దీంతో గంటే కదా అని అందరు ఒప్పుకుంటారు. కానీ ఎంతకీ బిగ్ బాస్ అవ్వకపోవడం .. మధ్యలో ఇంట్రెస్ట్ గా పోలీసులు, జడ్జీలు వచ్చి బిగ్ బాస్ ని చూస్తూ ఉండడం చూపించారు. ఇక చివరలో హోస్ట్ నాగార్జున వచ్చి చూసారుగా నో కామా, నో ఫుల్ స్టాప్.. ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్.. మీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో .. త్వరలో మీ ముందుకు రానుంది అంటూ ప్రోమో ను ఎండ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. 24 గంటలు ఎంతో రసవత్తరంగా సాగే బిగ్ బాస్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే అనేట్లుగా ప్రోమో ను కట్ చేశారు. ఈసారి ఓటిటీ నాన్ స్టాప్ లో బిగ్ సెలబ్రిటీలే పాల్గొంటున్నట్లు సమాచారం. మరి ఈసారి ఈ బిగ్ బాస్ ఎన్ని గొడవలతో మొదలవుతుందో చూడాలి.