Bigg Boss voice is not apt in Bigg Boss Telugu 7: తెలుగులో విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఏడవ సీజన్ లోకి అడుగుపెట్టింది. తెలుగులో మొదటి బిగ్ బాస్ సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండవ సీజన్ కి మాత్రం నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి అంటే మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. తాజాగా ఏడవ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నట్టుగా దాదాపు క్లారిటీ వచ్చేసింది. సెప్టెంబర్ మూడో తేదీన ఈ బిగ్ బాస్ సెవెన్ కార్యక్రమం చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. అయితే ఈ ప్రోగ్రాం ప్రారంభమైనప్పటి నుంచి అన్ని వింతగా ఉన్నట్లుగా చూస్తున్న అభిమానులు కామెంట్ చేస్తున్నారు. నిజానికి ముందే బిగ్ బాస్ ఇది ఉల్టా పుల్టా అని హిట్ ఇచ్చేసింది.
800 Trailer: గుండెల్ని మెలిపెట్టి వదిలేశారు.. గూజ్ బంప్స్ అంతే!
ఇక అందుకే బిగ్ బాస్ ఓటీటీ ఎలా అయితే లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారో ఈ బిగ్ బాస్ సెవెన్ కి కూడా అదే విధంగా లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ వస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అలా చేయవద్దని అభిమానులు కోరుతున్నారు, అన్నేసి గంటలు లైవ్ స్ట్రీమింగ్ చేస్తే చూడాలని ఆసక్తి తగ్గిపోతుందని వారు కామెంట్ చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఈసారి బిగ్ బాస్ కార్యక్రమానికి బిగ్ బాస్ వాయిస్ కూడా వింతగా ఉందని అంటున్నారు ఆడియన్స్. గతంలో బిగ్ బాస్ వాయిస్ వింటే ఒక రకంగా గూస్ బంప్స్ వచ్చేవి కానీ ఇప్పుడు ఆయన వాయిస్ వింటుంటే కామెడీగా అనిపిస్తోందని ప్రతిసారి డబ్బింగ్ చెప్పే వ్యక్తినే తీసుకురావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డబ్బింగ్ బిగ్ బాస్ కి ఏ మాత్రం సూట్ అవ్వలేదని వారు కామెంట్ చేస్తున్నారు.