బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో “బిగ్ బాస్-5” ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు నిర్వాహకులు షో స్ట్రీమింగ్ కోసం ముహూర్తం కూడా ఖరారు చేశారు. కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్-5కు కూడా హోస్ట్‌గా కొనసాగుతారు. “బిగ్ బాస్ 5” సెప్టెంబర్ 5 నుండి ప్రారంభమవుతుందని, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు ఛానల్ లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుందని స్టార్ మా ప్రకటించింది. ఇటీవల మేకర్స్ షోకే సంబంధించిన ప్రత్యేక ప్రోమోలను కూడా విడుదల చేశారు.
Read Also : నాని ట్వీట్… రేపు బిగ్ అప్డేట్
వారం రోజులలో పార్రంభం కానున్న “బిగ్ బాస్ 5” ప్రతిరోజూ రాత్రి 10 నుండి ప్రసారం అవుతుంది. వారాంతాల్లో మాత్రం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. పోటీదారుల గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి. కానీ షో నిర్వాహకులు మాత్రం కంటెస్టెంట్ల ఇంకా పేర్లను గోప్యంగానే ఉంచింది. పోటీదారులను సెప్టెంబర్ 5న కర్టెన్-రైజర్ ఎపిసోడ్ ద్వారా ప్రకటిస్తారు. అప్పటి వరకూ “బిగ్ బాస్-5” కంటెస్టెంట్ల విషయంలో సస్పెన్స్ తప్పదు. అయితే బయట జరుగుతున్న ప్రచారం మేరకు ఇటీవల కాలంలో యూట్యూబ్ లో ఫేమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్, యాంకర్స్ రవి, వర్షిణి సౌందరరాజన్, ఆర్జే కాజల్, నటి సరయు, హీరోయిన్ ఇషా చావ్లా, డాన్స్ మాస్టర్స్ రఘు, అని, నటరాజ్, విజె లోబో, టీవీ నటుడు, విజె సన్నీ, నటీనటులు శ్వేతవర్మ, మానస్, సిరి హనుమంతు, నవ్యస్వామి, ఆట సందీప్, బాలనటుడు దీపక్ ఈ షోలో పాల్గొనబోతున్నారట.