Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ తర్వాత రచ్చ మామూలుగా లేదు. అయితే శనివారం, ఆదివారం నాగార్జున వచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేస్తాడనే విషయం తెలిసిందే. ఇక ఆదివారంకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా కంటెస్టెంట్లకు నాగార్జున కొత్త బట్టలు కొనిచ్చాడు. సంప్రదాయమైన బట్టల్లో అందరూ మెరిసిపోయారు. ఇక చాలా రోజుల తర్వాత వాళ్ల ఇంట్లో వారితో వీడియో కాల్స్ మాట్లాడించాడు నాగార్జున.
Read Also : Nara Rohith : నారా రోహిత్ ఇంట్లో మొదలైన పెళ్లి సందడి
దీంతో కంటెస్టెంట్లు అందరూ ఎమోషనల్ అయ్యారు. భర్తతో పాటు ఇద్దరు పిల్లల్ని చూడగానే సంజన కంట్లో నీళ్లు తిరిగాయి. సుమన్, తనూజ పరిస్థితి కూడా అంతే. ఈ సందర్భంగా కంటెస్టెంట్లతో చాలా సరదాగా మాట్లాడాడు నాగార్జున. ప్రతి వీకెండ్ అందరికీ క్లాస్ తీసుకుంటున్న నాగ్.. ఈ ఆదివారం మాత్రం కండీషన్లు, చర్యలు లాంటివి లేకుండా అందరితో ఆడించి పాడించాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో చాలా సందడిగా కనిపిస్తోంది. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మరికొద్ది సేపట్లో తేలిపోతుంది.
Read Also : Chiranjeevi : చిరంజీవి కాళ్లమీద పడ్డ బండ్ల గణేశ్..