Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Bigg Boss Nonstop 24 7 Did Not Impress The Audience Much

BiggBoss: నాన్ స్టాప్… అట్టర్ ఫ్లాప్!

Published Date :March 9, 2022 , 8:19 pm
By Roja Pantham
BiggBoss: నాన్ స్టాప్… అట్టర్ ఫ్లాప్!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఓ మెతుకు పట్టుకుంటే చాలు! డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 26న గ్రాండ్ గా మొదలైన ‘బిగ్ బాస్ – నాన్ స్టాప్’ షో కంటెస్టెంట్స్ ను చూడగానే ఇది ఆకట్టుకునే కార్యక్రమం కాదనేది వీక్షకులకు అర్థమైపోయింది. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి, ఆరేడు వారాల లోపే బయటకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ను తిరిగి తీసుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటో నిర్వాహకులకే తెలియాలి. బహుశా వీరంతా బయట ఖాళీగా ఉండిపోయారని వారికో చాన్స్ ఇచ్చారేమో అనిపిస్తోంది. వీరిని ‘వారియర్స్’ అనే ట్యాగ్ లైన్ తో హౌస్ లోకి తీసుకొస్తే, ముక్కూ ముఖం తెలియని మరి కొందరిని ఛాలెంజర్స్ పేరుతో రంగంలోకి దింపారు. ఈ రెండు గ్రూప్స్ మధ్య టాస్క్ లు పెడుతూ, వినోదం చూడండంటూ వీక్షకుల మీదకు వదిలారు. వారియర్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వారు వ్యూవర్స్ ను ఆకట్టుకున్న వారూ కాదు. ఆ మధ్య ఇంటర్వ్యూలలో వీళ్లందరినీ ‘మళ్ళీ బిగ్ బాస్ షో లో ఛాన్స్ వస్తే వెళతారా?’ అని ఎందుకు అడిగారో ఇప్పుడు అర్థమైంది. అలా ఆసక్తి ఉన్న వారి లిస్ట్ చేసుకుని, అందులో కొందరిని ఈ షోకు ఆహ్వానించారు. ఇక చాలెంజర్స్ గ్రూప్ మెంబర్స్ అయితే మరీ దారుణం. ఠక్కున అందులో నలుగురి పేర్లు చెప్పమంటే చెప్పలేని పరిస్థితి. ‘స్టార్ మా’లో ప్రసారం అయినప్పుడు బిగ్ బాస్ షోలో పాల్గొన్న చాలామంది కంటెస్టెంట్స్ గురించి జనం పెదవి విరిచేవారు. ఇక ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుండటంతో… నెంబర్ కు ప్రాధాన్యం ఇచ్చారు తప్ప ఎంపిక చేసిన మెంబర్ కు ఉన్న విలువ ఏమిటనేది చూసినట్టుగా లేదు. ఇక పాత వారే ఉండటంతో ఇదేదో పాత స్టఫ్ మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారేమో అనేవారు లేకపోలేదు.

BB Non-Stop: Stage set for unlimited drama with Challengers vs Warriors

ఇదిలా ఉంటే… కొద్దో గొప్పో జనంలో క్రేజ్ ఉన్న ముమైత్ ఖాన్ ను మొదటి వారంలోనే ఎలిమినేట్ చేసేసి బిగ్ బాస్ ఘోరమైన తప్పు చేశాడనిపిస్తోంది. ఆమె కంటే తక్కువ ఓట్లు వచ్చిన వారిని కావాలనే సేవ్ చేశారనేది తెలిసిపోతోంది. బహుశా దీని మీద సోషల్ మీడియా చర్చ జరిగి తద్వారా ఈ షోకు ప్రచారం తెచ్చుకోవాలని నిర్వాహకులు భావించారేమో తెలియదు.

Also Read

  • Vijay: పాపం విజయ్... రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
  • Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
  • Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్‌లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
  • Peddi : 'పెద్ది' ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!
Add as a preferred
source on google
Bigg Boss Telugu: From Mumaith Khan to Monal Gajjar, a recap of non-Telugu  speaking contestants in the reality TV series so far | The Times of India

అలానే బిగ్ బాస్ షో పట్ల గతంలోనే అనేకానేక విమర్శలు ఉండేవి. ఇప్పుడు ఓటీటీలో ప్రసారం కావడంతో షోలో కంటెస్టెంట్స్ మాటలకు, చేతలకు అదుపు లేకుండా పోయింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాటు చీప్ బాడీ లాంగ్వేజ్ తో చెవులు, కళ్లు మూసుకునేలా చేశారు. దాంతో ఈసారి కూడా విమర్శకులు గట్టిగానే విరుచుకు పడ్డారు. బహుశా అందుకే కావచ్చు… లైవ్ షో అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసి, ఆ పైనా రెండు మూడు రోజులకే నాలుక కరుచుకుని ఓ రోజు మొత్తం షో నిలిపి వేశారు. చివరకు లైవ్ ఎపిసోడ్ ను కొన్ని గంటల ఆలస్యంగా, మొత్తం 24 గంటల కంటెంట్ ను ఒక గంటకు కుదించి ప్రతి రోజు రాత్రి 9 గంటలకూ స్ట్రీమింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా బూతులు మాట్లాడితే మ్యూట్ చేయడం, మరీ వల్గర్ గా బిహేవ్ చేస్తే దానిని ఎడిట్ చేస్తున్నారట.

Bigg Boss Non Stop: బిందుమాధవి అందం.. నోరు జారిన నటరాజ్.. వెనకాల ఒకటి ముందు  ఒకటి అంటూ | Bigg boss non stop telugu Natraj master shocking comments on  bindhumadhavi beauty - Telugu Filmibeat

చిత్రం ఏమంటే… గంట కంటెంట్ కే చూసే దిక్కులేదంటే… ఇక ఇరవై నాలుగు గంటల లైవ్ చూసేది ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది! దీనికి తోడు వ్యాఖ్యాత అక్కినేని నాగార్జున ఫస్ట్ వీకెండ్ లో ‘ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్స్… ఏ షోకు రానంత హయ్యెస్ట్ వ్యూవర్ షిఫ్ బీబీ నాన్ స్టాప్ కు వచ్చింది’ అని ప్రకటించారు. ఆయన మాటలు విని అవాక్కుకాని వీక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ‘ఇంత దరిద్రమైన షోకు హయ్యెస్ట్ వ్యూవర్ షిప్‌ ఏమిటీ? నాగార్జున మాటలు కోటలు దాటేస్తున్నాయి’ అనే కామెంట్స్ విపరీతంగా వినిపించాయి. అంతేకాదు… ‘గ్రాండ్ జోక్ ఆఫ్ ది ఇయర్’ అంటూ మరికొందరు కామెడీ చేసేశారు. మొదటి వారమే ఇంత దారుణంగా ఉంటే 84 రోజుల ఈ షోను మున్ముందు ఎలా నడుపుతారనే అనుమానం చాలామందికి కలుగుతోంది. కొత్త కాన్సెప్ట్ అంటూ మొదలు పెట్టారు కాబట్టి… ఎలాగోలా సో.. సో… గా షోను నడిపేస్తారా? లేకపోతే పట్టుదలకు పోకుండా చేసిన తప్పును దిద్దుకుంటూ మధ్యలోనే శుభం కార్డు వేస్తారా? అనేది చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akkineni Nagarjuna
  • Bigg Boss OTT
  • disney+hot star
  • non stop entertainment
  • Tollywood News

తాజావార్తలు

  • HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష

  • ICC ODI Rankings: టీమిండియా ‘వన్డే’ జైత్రయాత్ర.. ప్రపంచ ఛాంపియన్లనే వెనక్కి నెట్టి అగ్రస్థానంలో భారత్!

  • Ittehad-ul-Mujahideen: పాక్‌ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!

  • Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?

  • Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions