సిరి హన్మంత్.. బిగ్ బాస్ సీజన్ 5 లో అమ్మడి పేరు మారుమ్రోగిపోయింది. వెబ్ సిరీస్ లు, చిన్న చిన్న సీరియల్స్ లో కనిపించి మెప్పించిన సిరి ఒక్కసారిగా బిగ్ బాస్ ఛాన్స్ అందుకొని స్టార్ గా మారిపోయింది. ఇక బిగ్ బాస్ లో యూట్యూబర్ షణ్ముఖ్ తో ప్రేమాయణం నడిపి బయటికి వచ్చాకా షన్ను, దీప్తి సునైనా బ్రేకప్ కు కారణం ఈమె అంటూ వార్తలు గుప్పుమనడంతో మరింత పాపులర్ అయ్యింది. ఆ తరువాత బిగ్ బాస్ లో షన్ను, సిరిల మధ్య ఉన్న బంధాన్ని చూసి సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ కూడా ఆమెకు బ్రేకప్ చెప్పినట్లు వార్తలు హల్చల్ చేశాయి. అందుకు నిదర్శనంగా శ్రీహన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో సిరి ఫోటోలను డిలీట్ చేశాడు. దీంతో వీరిద్దరూ విడిపోయారంటూ రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే ప్రస్తుతం విడిపోయిన ఈ జంట మళ్లీ కలుసుకున్నారని తెలుస్తోంది.
తాజాగా సిరి ఒక లగ్జరీ కారును కొనుగోలు చేసింది. MG హెక్టార్ కారును ప్రియుడితో కలిసి సిరి కొనుగోలు చేయడం విశేషం. ఈ కారు విలువ సుమారు రూ. 20 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇక ఈ విషయాన్ని సిరి ప్రియుడు శ్రీహన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ” మా ఇంటికి స్వాగతం MG హెక్టార్.. సిరి హన్మంత్ శుభాకాంక్షలు.. ముందు డ్రైవింగ్ నేర్చుకో” అంటూ పరువు తీసేశాడు శ్రీహన్. ఇవన్నీ పక్కన పెడితే ఈ జంట మళ్లీ కలిసినందుకు అభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు. వీరిలానే షన్ను, దీప్తి కూడా కలిస్తే బావుంటుందని కోరుకుంటున్నారు.