Deeksha Panth : బిగ్ బాస్ మొదటి సీజన్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి దీక్షా పంత్. పక్కా తెలుగు అమ్మాయి అయిన ఈ బ్యూటీ.. చాలా సినిమాల్లో నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాల్లో అవకాశాలు, కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను మొదట్లో సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. కానీ అనుకోకుండా వచ్చా. మొదట్లో మోడలింగ్ చేశా. దాంతో కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ అవకాశాలు వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బందులు పెట్టేవాళ్లు. సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటే ఇంకేదో కావాలని అడిగేవాళ్లు.
Read Also : Vishwambhara : విశ్వంభరపై చిరంజీవి ట్వీట్.. రేపు భారీ అప్డేట్
నేను ముఖం మీదే నో చెప్పేదాన్ని. దాంతో చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయాను. అయినా సరే నన్ను నేను మార్చుకోలేదు. రాసుకుని, పూసుకుని తిరగడం నాకు నచ్చదు. అందుకే నా లైఫ్ లో సక్సెస్ లేదు. ఇప్పటికీ నేను ఒంటరిగానే అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్నాను. ఆ మధ్య ఓ పెద్ద డైరెక్టర్ సినిమాలో అవకాశం ఇచ్చారు. కానీ సడెన్ గా తీసేశారు. దాంతో చాలా బాధేసింది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆఫర్లు వచ్చినట్టే వచ్చి చేజారి పోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈమె పవన్ కల్యాణ్ నటించిన గోపాల గోపాల, రచ్చ, వరుడు, ఒక లైలా కోసం లాంటి సినిమాల్లో నటించింది.
Read Also : JR NTR : ఎన్టీఆర్ పెద్దమనసు.. అతన్ని ఆదుకుంటున్నాడా..?