ధృవ సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు అలీ రైజా. ఇక ఈ ఫేమ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ గా బయటికి వచ్చాడు. ఈ నటుడు బిగ్ బాస్ లోకి వెళ్లివచ్చి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు ఒక సినిమాలో కానీ, సీరియల్ లో కానీ కనిపించలేదు. కనీసం వేడుకలలో కూడా సందడి లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించే అలీ తాజాగా ఒక షో లో పాల్గొన్నాడు. దీంతో మీ అభిమానులు మీకోసం ఎదురుచుస్తున్నారు.. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు..? ఎందుకు నటించడం లేదు..? అని అడిగిన ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ చెప్పి పహాట్ టాపిక్ గా మారాడు. సినిమాల నుంచి తనను బ్యా చేశారని, అందుకే సినిమాల్లో కనిపించడం లేదని చెప్పేసరికి అటు యాంకర్ తో పాటు ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
” నేను బిగ్ బాస్ షో కి వెళ్లే ముందు చేయకూడని ఒక తప్పు చేశాను.. ఒకరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే నేను అక్కడికి వెళ్లాను. లోపలి అడుగుపెట్టగానే అలీ.. నిన్ను రెండేళ్లు బ్యాన్ చేస్తున్నాం అని చెప్పారు. ఆ మాటలు విని నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయ్యింది. ఇక ఆ తరువాత నేను బిగ్ బాస్ కి వెళ్లడం, రావడం జరిగాయి. దీనివల్లనే నేను సినిమాలో కానీ, సీరియల్ లో కానీ కనిపించడం లేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అలీ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే అతడు ఏ తప్పు చేయడం వలన బ్యాన్ చేశారో అనే సంగతిని అలీ బయటపెట్టలేదు. మరి పీ షో పూర్తి ఎపిసోడ్ లోనైనా అస్సలు సంగతి బయటపెడతాడేమో చూడాలి