“బిగ్ బాస్ తెలుగు-4″తో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ఆ షోలో నుంచి బయటకు వచ్చిన తరువాత యంగ్ బ్యూటీ దివి అనేక ఓటిటి ఆఫర్లను అందుకుంది. మిగతా కంటెస్టెంట్లు ఎవరికీ ఇన్ని ఆఫర్లు రాలేదనే చెప్పాలి. ఆమె ఇటీవల క్యాబ్ స్టోరీస్, స్పార్క్ ఓటిటిలో ప్రీమియర్ అయిన మరో తెలుగు సిరీస్ లో కన్పించింది. ఇప్పుడు దివి మరో పెద్ద ఓటిటి ఆఫర్‌ని సొంతం చేసుకుంది. గతంలో “సోగ్గాడే చిన్ని నాయన”కు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ అందించే వెబ్ సిరీస్ కోసం ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది. వెబ్ సిరీస్ కు కళ్యాణ్ కృష్ణ కథను అందించడమే కాకుండా స్వయంగా నిర్మిస్తున్నాడు. సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు.
Read Also : ఒకే వేదికపై బాబూ మోహన్, ఆలీ, ఎస్వీ కృష్ణా రెడ్డి… ‘చినుకు చినుకు అందెలలో’ చిందులు!
అతని సహచరుడు నవీన్ గాంధీ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. దివి వెబ్ సిరీస్‌లో హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. చిరంజీవి తెలుగు రీమేక్ “లూసిఫర్”లో కూడా దివి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బిగ్ బాస్ దివి జీవితాన్ని మార్చేశాడు.