Bigg Boss : బిగ్ బాస్ సీజన్ 9 వచ్చే నెల నుంచి స్టార్ట్ కాబోతోంది. ఈ సారి వెరైటీగా షో కంటే ముందే సామాన్యుల కోటాలో ముగ్గురిని లోపలికి పంపించేందుకు వారికి పోటీలు కూడా పెడుతున్నారు. దీనికి అగ్నిపరీక్ష అనే షో కూడా స్టార్ట్ చేశారు. శ్రీముఖి యాంకర్ గా ఉండగా.. నవదీప్, అభిజీత్, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా షో ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో వికలాంగులు, వృద్ధులు, హిజ్రాలు, మాస్కులు పెట్టుకున్న వాళ్లు ఇలా చాలా మంది కనిపించారు. అందరూ తమ ట్యాలెంట్ తో అలరిస్తున్నారు. తమకున్న కష్టాలను చెబుతూనే జోవియల్ గా మాట్లాడారు.
Read Also :Nidhi Agarwal : భయపెడుతా అంటున్న నిధి అగర్వాల్..
నవదీప్ పై అమ్మాయిలు వేసిన పంచులు బాగా పేలాయి. నేను ఆడ నవదీప్ ను అని ఓ అమ్మాయి అనడం.. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా నవదీప్ ను అని శ్రీముఖి అడగ్గా.. ఎందుకండి అతను అంటూ వెరైటీగా ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం నవ్వులు పూయించాయి. మధ్యలో ఓ మసులావిడ బోనాలు ఎత్తుకుని చేసిన సీన్ బాగుంది. అలాగే చివర్లో ఒక కాలు లేని వ్యక్తి చేసిన స్టంట్ ఆకట్టుకుంది. అలాగే మరికొందరు రకరకాల ట్యాలెంట్ ను చూపించారు. ఇందుకు సంబంధించిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో జడ్జిలు మార్కులు వేస్తుంటే సామాన్యులు ఎమోషనల్ అవుతున్నది కూడా కనిపిస్తుంది. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఈ అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ జరుగుతుంది. ఫైనల్ గా ఇందులో నుంచి ముగ్గురిని బిగ్ బాస్ కు పంపించబోతున్నారు.
Read Also : Nagarjuna : ఆయన కోసం పార్కుల చుట్టూ తిరిగా.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్..