Bigg Boss 6: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. వాళ్లిద్దరూ అవుట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 6: బిగ్‌బాస్-6 చివరి దశకు చేరుకుంది. వచ్చే వారం ఫినాలే వీక్ జరగబోతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్, ఇనయా, కీర్తి, శ్రీసత్య 13వ వారం కొనసాగుతున్నారు. 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజన్ ఏడుగురు కంటెస్టెంట్లకు చేరుకుంది. మిగతా సీజన్ల కంటే ఈ సీజన్ చప్పగా సాగుతుందనే రూమర్ ఉంది. అయినా బిగ్‌బాస్ 6ను చూసేవాళ్లు లేకపోలేదు. ప్రారంభంతో పోలిస్తే ప్రస్తుతం మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈవారం ఫినాలె టిక్కెట్ సంపాదించిన శ్రీహాన్ మినహా మిగతా ఆరుగురు నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. దీంతో ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న అంశం ఆసక్తి రేపుతోంది.
Read Also: Tamannaah: ఎట్టకేలకు పెళ్లి గురించి ఓపెన్ అయిన మిల్కీ బ్యూటీ
Also Read
అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. వచ్చేవారం ఫినాలే వీక్ కాబట్టి టాప్-5 మాత్రమే హౌస్‌లో ఉంటారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రకారం శ్రీసత్య, కీర్తి ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. ఈ వారం రేవంత్ అత్యధిక ఓట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడే బిగ్‌బాస్ విన్నర్‌గా నిలుస్తాడనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అటు ఇనయా రెండో స్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్ మూడో స్థానంలో, ఆదిరెడ్డి నాలుగో స్థానంలో ఉన్నారు. ఫ్యామిలీ వీక్ తర్వాత రోహిత్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో అతడు టాప్-3లో ఉంటాడని కూడా టాక్ నడుస్తోంది. చివరి రెండు స్థానాల్లో కీర్తి, శ్రీసత్య కొనసాగుతున్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి వీళ్లిద్దరూ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారని గాసిప్ రాయుళ్లు చెప్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఈ వీకెండ్ వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్‌లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్‌రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
-
Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!