బిగ్ బాస్ 5 రియల్ విన్నర్ శ్రీరామచంద్రేనా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5కి తెరపడింది. గత ఆదివారం విన్నర్ ని ప్రకటించారు. సన్ని విజేతగా, షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచారు. మూడో స్థానాన్ని మాజీ ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర పొందారు. ఇదిలా ఉంటే ఈ బిగ్ బాస్ సీజన్ 5 అంతా డల్ గా గడిచింది. గత సీజన్స్ తో పోలిస్తే రేటింగ్ లోనూ బాగా వెనుకబడింది. దానికి కారణం అంత ఆసక్తిగా లేకపోవడంతో పాటు పాల్గొన్న వారికి అంతంత ఇమేజ్ ఉండటమే. పోటీదారులను ప్రకటించిన తొలి ఎపిసోడ్ తోనే అందరూ పెదవి విరిచారు. అయితే వేరే ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడంతో పాటు థియేటర్లకు వెళ్ళే సాహసం చేయలేక పోవడం వల్ల బిగ్ బాస్ 5 కి ఈ మాత్రం ఆదరణ అయినా దక్కింది.
ఇక ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేసిన పోటీదారులలో ఎక్కువ మంది ముందుగానే సోషల్ మీడియాలో తమ తమ బృందాలను ఏర్పాటు చేసుకుని బల్క్ ఓటింగ్ చేయించుకున్నారు. దాంతో ఆదరణలో వెనుకబడ్డా ఓటింగ్ శాతం గత సీజన్స్ కంటే పెరిగింది. హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించాడు. విజేతను ప్రకటించే సమయంలో కూడా దాదాపు 12 కోట్ల ఓట్లు పోలయ్యాయని చెప్పడం అందుకు నిదర్శనం. ఓటింగ్ సహజమైన రీతిలో పెరిగితే టిఆర్పీ కూడా పెరగాలి. కానీ టీఆర్పీ తగ్గుతూ ఓటింగ్ పెరిగిందంటేనే అందులో మతలబు అర్థం అవుతోంది.
Also Read
ఇక విజేత విషయానికి వస్తే ఇటు ప్రజల్లోనూ ఎలిమినేట్ అయి ఫినాలే పాల్గొన్న కంటెస్టెంట్స్ లోనూ ఒకటే ఏకాభిప్రాయం వ్యక్తం అయింది. అందరూ శ్రీరామచంద్రను విజేతగా చూడాలని కోరుకున్నారు. అంటే హౌస్ లో గేమ్ ను జెన్యూన్ గా ఆడి అందరి మనసులు గెలుచుకుంది శ్రీరామచంద్రనే. అయితే అనూహ్యంగా శ్రీరామచంద్ర మూడో ప్లేస్ మాత్రమే దక్కించుకున్నాడు. దానికి కారణం సన్నీ, షణ్ముఖ్ పెయిడ్ ఓటింగ్. వీరిద్దరూ లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి తమ తమ బృందాలతో పోటాపోటీగా ఓట్లను గుద్దించుకున్నారు. దీంతో వారిద్దరే తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బిగ్ బాస్ కి కావలసింది కూడా ఓటింగ్ కనుక వేరే దారి లేక వారినే విన్నర్, రన్నర్ గా ఎంపిక చేయవలసి వచ్చింది. నిజానికి ప్రజాభిప్రాయం ప్రకారం అయితే బిగ్ బాస్ 5 విన్నర్ శ్రీరామచంద్రనే. కనీసం వచ్చే సీజన్ నుంచి అయినా బల్క్ అండ్ పెయిడ్ ఓటింగ్ ఉంటే పరిగణనలోకి తీసుకోమని బిగ్ బాస్ ప్రకటిస్తే ఈ షోకి ఆదరణ పెరుగుతుంది. లెట్స్ హోప్ సో.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!