OG : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా వరుసగా అప్డేట్లు ఇస్తున్నారు. తాజాగా సినిమా నుంచి భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఇందులో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నట్టు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ గా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రకాశ్ రాజ్ నటించారనే విషయాన్ని మూవీ టీమ్ చెప్పలేదు. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ఆయన పాత్రను పరిచయం చేశారు.
Read Also : Suman Shetty : ఆ డైరెక్టర్ కు రోజూ పూజ చేస్తున్న సుమన్ శెట్టి..
తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ప్రకాశ్ రాజ్ శాలువా కప్పుకుని, కళ్లజోడు పెట్టుకుని సీరియస్ లుక్ లో ఉన్నాడు. ఆయన పాత్ర పేరు సత్యదాదాగా ప్రకటించారు. ఆయన పాత్ర నెగెటివ్ షేడ్స్ ఉన్నదా లేదంటే పాజిటివ్ షేడ్స్ ఉన్నదా తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. అయితే ప్రకాశ్ రాజ్ ఈ నడుమ పవన్ కల్యాణ్ పై కొన్ని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయినా సరే పవన్ సినిమాలో ఆయనకు ఛాన్స్ ఇచ్చారంటే ఒకింత ఆశ్చర్యమే అని చెప్పుకోవాలి.
Read Also : Rakul Preet : రకుల్ పరువాల నిధులు.. చూస్తే మతులు పోవాల్సిందే
