తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ అంటే కుటుంబ ప్రేక్షకులు, పండగ వాతావరణంతో పాటు ఉత్సాహభరితమైన సంగీతం గుర్తుకు వస్తాయి. అలాంటి సంక్రాంతి సినిమాలకు ప్రాణం పోస్తున్న సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో తనదైన ముద్ర వేస్తున్నారు. 2025లో పండగ వైబ్‌ను సెట్ చేసిన భీమ్స్.. 2026 సంక్రాంతిని కూడా తన సంగీతంతో ఓన్ చేసుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
గత ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. గోదారి గట్టు, మీను, బ్లాక్ బస్టర్ పొంగల్ పాటలు హిట్ అయ్యాయి. 2026 సంక్రాంతికి విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాల్లో కూడా భీమ్స్ సంగీతమే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా పండగ వాతావరణానికి తగ్గట్టు ఎనర్జిటిక్ బీట్స్, మాస్ ట్యూన్స్‌తో థియేటర్లలో ప్రేక్షకులను ఎంజాయ్ చేసేలా చేశారు. ఈ రెండు సినిమాలకు భీమ్స్ అందించిన సంగీతం పెద్ద ప్లస్‌గా మారింది. పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కథను మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రేక్షకులు అంటున్నారు.
Also Read: Vk Naresh: వరుస సినిమాలు.. నరేష్ క్రేజ్ మాములుగా లేదుగా!
పండగ సినిమాలకు అవసరమైన ఉత్సాహం, ఎమోషన్, మాస్ అప్పీల్ అన్నింటినీ సమతుల్యం చేస్తూ.. భీమ్స్ సిసిరోలియో తన సంగీతంతో సంక్రాంతి బ్లాక్‌బస్టర్లకు డ్రైవింగ్ ఫోర్స్‌గా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనను ‘ది సౌండ్ ఆఫ్ సంక్రాంతి’గా ప్రశంసిస్తున్నారు. మొత్తానికి 2025లో సంక్రాంతి వైబ్‌ను సెట్ చేసి.. 2026లో కూడా అదే ఊపు కొనసాగిస్తూ భీమ్స్ మరోసారి తన సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. రాబోయే రోజుల్లో ఆయన నుంచి మరిన్ని పండగ బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌లు రావాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.